Sunny : బిగ్ బాస్ విన్న‌ర్ స‌న్నీకి రూ.100 కోట్ల క‌ట్నం ఆఫ‌ర్.. అమ్మాయి ఎవ‌రో తెలుసా?

December 30, 2021 9:12 AM

Sunny : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మంతో చాలా మంది ఫేమ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్ప‌డ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా బిగ్ బాస్ విన్న‌ర్ స‌న్నీకి ఓ ఎన్నారై అదిరిపోయే ఆఫ‌ర్ ఇచ్చింది. ఏకంగా వంద కోట్ల రూపాయ‌లు క‌ట్నంగా ఇస్తాన‌ని చెప్పి అత‌డిని పెళ్లి చేసుకోమ‌ని వేడుకుంది. దీనికి స‌న్నీ త‌న‌దైన శైలిలో స్పందించాడు.

Sunny  got rs 100 crore dowry offer from NRI

అమెరికా నుంచి ఉష అనే మహిళ సన్నీకి వీడియో కాల్‌ చేసి తన కూతుర్ని పెళ్లి చేసుకో అని అడిగేసింది. అంతేకాకుండా కట్నంగా రూ.100 కోట్లు ఇస్తానని పేర్కొంది. దీంతో ‘నన్ను భరించాలంటే చాలా ఓర్పు ఉండాలి. మీరు ఆ మాట అన్నారు చాలు’ అంటూ సన్నీ ఆన్సర్‌ ఇవ్వగా.. నేను సీరియస్‌గా అడుగుతున్నా అంటూ ఆమె లైవ్‌లోనే పెళ్లి సంబంధం మాట్లాడింది. ​ప్రస్తుతం సన్నీకి వచ్చిన ఈ పెళ్లి ప్రపోజల్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్యక్ర‌మంకి ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి విన్న‌ర్‌గా నిల‌వ‌డం గొప్ప విష‌య‌మ‌నే చెప్పాలి. త‌న‌దైన శైలిలో గేమ్ ఆడుకుంటూ వ‌చ్చిన స‌న్నీ ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నాడు. అత‌డికి ఇప్పుడు ప‌లు సినిమా ఆఫ‌ర్స్ కూడా వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది. రీసెంట్ గా త‌న ఫేవ‌రేట్ స్టార్ నానిని కూడా క‌లిశాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment