Madhavi Latha : స‌న్నీ నీ పద్ద‌తి క‌రెక్ట్ కాదు.. చెంప ప‌గ‌ల‌గొడ‌తాను అన్న హీరోయిన్..

December 26, 2021 10:47 AM

Madhavi Latha : స‌న్నీ ప్రేక్ష‌కుల ఓట్ల‌తో బిగ్ బాస్ సీజ‌న్ 5 విన్న‌ర్‌గా అవ‌తరించిన విష‌యం తెలిసిందే. అత‌ని ఆట‌తోపాటు చేసిన సంద‌డితో విజేత‌గా నిలిచాడు స‌న్నీ. అయితే హౌజ్ లో ఉన్న‌ప్పుడు ప్రేక్ష‌కులని అభ్య‌ర్ధించిన స‌న్నీ గెలిచాక వారిని ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడి విజయంలో కీలక పాత్ర పోషించిన ఫ్యాన్‌ పేజీలు, కొన్ని యూట్యూబ్‌ ఛానళ్ల వంక తలెత్తి కూడా చూడటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Madhavi Latha said she will slap sunny if he insults his fans

విన్నర్‌గా నిలిచిన సన్నీకి గర్వం తలకెక్కిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నటి మాధవీలత అగ్గి మీద గుగ్గిలమైంది. ‘సన్నీ కోసం సపోర్ట్‌ చేసిన ఫ్యాన్‌ పేజీలను వదిలేసి, రివ్యూయర్లను వదిలేసి, ఓట్లు వేయడానికి వాళ్లు పడ్డ కష్టాన్ని వదిలేసి, ఓట్లు వేయండని మొత్తుకునే వాళ్లను వదిలేసి బడా టీవీ ఛానళ్లకు, ఎక్కువ ఫాలోవర్లు ఉన్న యూట్యూబ్‌ ఛానళ్లకు అతడు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు.

సన్నీ తప్పు చేస్తున్నాడు. కృతజ్ఞతాభావం లేనివాళ్లంటే నాకు చిరాకు. అతడి కోసం ఎంతమంది పీఆర్‌ (పర్సనల్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌)లా మారిపోయారు. వాళ్లకు థ్యాంక్స్‌ అని ఒక మాట చెప్తే అయిపోతుందా ? తన గురించి గొప్పగా చెప్పుకొచ్చిన యూట్యూబ్‌ రివ్యూయర్ల పేర్లయినా మెన్షన్‌ చేశాడా ? పోనీ తనకు తెలీకపోతే అతడి ఫ్రెండ్స్‌కి తెలీదా? కళ్లు నెత్తికెక్కాయా ? నీ పీఆర్‌ ఫ్రెండ్‌ కనిపిస్తే చెంప పగలగొడతాను. సాధారణ జనానికి విలువివ్వకపోతే అక్కడే ఆగిపోతావు గుర్తుంచుకో. నాకు కోపం వస్తే అదే మీడియాలో నిలబెట్టి కడిగేస్తా. నచ్చితే నెత్తిన పెట్టుకుంటాను, తిక్కలేస్తే తాట తీసి ఆరేస్తా’ అని వార్నింగ్‌ ఇచ్చింది మాధవీలత.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment