Vijay Devarakonda : టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారనున్నారు. వరల్డ్ ఫేమస్ లవర్ గా ఫేమస్ అయిన ఈ హీరో ఇప్పుడు యాక్షన్ కమ్ రొమాంటిక్ డ్రామా అయిన లైగర్ సినిమాలో అనన్యతో కలిసి వర్క్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈమె బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సినిమాలో తన గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేస్తున్న అనన్యకు, విజయ్ దేవరకొండ బర్త్ డే విషెస్ తెలియజేసి.. తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. విజయ్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో అనన్య పాండేపై ఉన్న ఎఫెక్షన్ ను చాలా అందంగా తెలియజేశారు.
అలాగే సోషల్ మీడియాలో అనన్య పాండేకు లైగర్ సినిమా టీమ్ తోపాటు ఆమె ఫ్రెండ్స్ కూడా విష్ చేశారు. విజయ్ దేవరకొండ, అనన్య పాండే కలిసి నటిస్తున్న లైగర్ సినిమాకు పూరీ జగన్నాథ్ పవర్ ఫుల్ స్టోరీని అందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు.
లైగర్ సినిమాలో విష్ణు రెడ్డి, ఆలీ, రోనిత్ రాయ్, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను పూరీ జగన్నాథ్ కనెక్ట్స్ బ్యానర్ తోపాటు ఛార్మీ కౌర్, కరణ్ జోహార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమా ఐదు భాషల్లో రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇక అనన్య పాండే పై కొన్ని రోజుల క్రితం ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో భాగంగా అనన్య ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…