Vijay Devarakonda : కొత్త గ‌ర్ల్ ఫ్రెండ్‌కి విజ‌య్ దేవ‌ర‌కొండ బ‌ర్త్ డే విషెస్‌..!

November 1, 2021 2:23 PM

Vijay Devarakonda : టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారనున్నారు. వరల్డ్ ఫేమస్ లవర్‌ గా ఫేమస్ అయిన ఈ హీరో ఇప్పుడు యాక్షన్ కమ్ రొమాంటిక్ డ్రామా అయిన లైగర్ సినిమాలో అనన్యతో కలిసి వర్క్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈమె బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సినిమాలో తన గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేస్తున్న అనన్యకు, విజయ్ దేవరకొండ బర్త్ డే విషెస్ తెలియజేసి.. తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. విజయ్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో అనన్య పాండేపై ఉన్న ఎఫెక్షన్ ను చాలా అందంగా తెలియజేశారు.

Vijay Devarakonda birth day wishes to his new girl friend

అలాగే సోషల్ మీడియాలో అనన్య పాండేకు లైగర్ సినిమా టీమ్ తోపాటు ఆమె ఫ్రెండ్స్ కూడా విష్ చేశారు. విజయ్ దేవరకొండ, అనన్య పాండే కలిసి నటిస్తున్న లైగర్ సినిమాకు పూరీ జగన్నాథ్ పవర్ ఫుల్ స్టోరీని అందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు.

లైగర్ సినిమాలో విష్ణు రెడ్డి, ఆలీ, రోనిత్ రాయ్, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను పూరీ జగన్నాథ్ కనెక్ట్స్ బ్యానర్ తోపాటు ఛార్మీ కౌర్, కరణ్ జోహార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమా ఐదు భాషల్లో రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇక అనన్య పాండే పై కొన్ని రోజుల క్రితం ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో భాగంగా అనన్య ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now