Samantha : విడాకుల త‌ర్వాత కూడా సామ్‌ని స‌పోర్ట్ చేస్తున్న‌వెంకీ కూతురు…!

October 28, 2021 9:53 AM

Samantha : అక్టోబ‌ర్ 2న స‌మంత‌ – నాగ చైత‌న్య బంధానికి బ్రేక్ ప‌డిన విష‌యం తెలిసిందే. అంత‌క‌ముందు నుండే ఎవ‌రి దారుల‌లో వారు ప‌య‌నిస్తూ వ‌చ్చారు. అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న త‌ర్వాత స‌మంత‌పై దారుణంగా ట్రోల్స్ న‌డిచాయి. అవేమీ ప‌ట్టించుకోని సామ్ త‌న ఫ్రెండ్స్‌తో టూర్స్ వేస్తోంది. ఇటీవల ఆధ్యాత్మిక యాత్ర ముగించుకొని వచ్చిన సమంత.. ఇప్పుడు తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి హాలిడే కోసం దుబాయ్ కి వెళ్ళింది.

venkatesh daughter ashritha comment on Samantha

సమంత తన మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ , స్టైలిస్ట్ జుకల్కర్ ప్రీతమ్ తో కలిసి ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. విడాకుల ప్రకటన తర్వాత కష్ట సమయంలో సాధనా సింగ్ – ప్రీతమ్ – శిల్పారెడ్డి వంటి వారు సామ్ కు సపోర్ట్ గా నిలిచారు. అందుకే వారితో కలిసి సంతోషకరమైన క్షణాలను గడుపుతోంది. అయితే స‌మంత‌కు వెంక‌టేష్ కూతురు ఆశ్రిత కూడా త‌న వంతు స‌పోర్ట్ అందిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

రీసెంట్‌గా స‌మంత‌.. ఒక పెయింటింగ్ గురించి పోస్ట్ చేస్తూ సూక్తిని చెప్పింది. మీ మనసు మీతో.. పెయింటింగ్ వెయ్యలేను.. అని చెబితే.. అప్పుడే మనం పెయింట్ వేయాలి.. అలా వెంటనే వేయకపోతే లోపల అనుకున్న మాటలు ఆగిపోతాయి.. అని తెలిపింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పెయింట్ కి సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన వెంకీ కూతురు ఆశ్రిత .. ఫ్రీగా పెయింటింగ్ వేసు..కో అంటూ కామెంట్ చేసింది. అలాగే మంచు లక్ష్మికూడా.. ఇంత సరదాగా ఉన్నందుకు హ్యాపీగా ఉందని పేర్కొంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment