Vanitha Vijay Kumar : నా తండ్రి న‌న్ను గెంటేశాడు.. నేను అన్ని సార్లు విడాకులు తీసుకునేందుకు కార‌ణం అదే..

February 2, 2022 7:19 PM

Vanitha Vijay Kumar : సీనియ‌ర్ న‌టులు మంజుల‌, విజ‌య్ కుమార్ ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. వీరి పెద్ద కుమార్తె వ‌నిత విజ‌య్ కుమార్ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తుంటుంది. ఈమె ఇప్ప‌టి వ‌ర‌కు మూడు వివాహాలు చేసుకుంది. కానీ ఒక్క‌టి కూడా నిల‌బ‌డ‌లేదు. మూడు సార్లు విడాకులు తీసుకుంది. అయితే త‌న జీవితం గురించి వ‌నిత విజ‌య్ కుమార్ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించింది.

Vanitha Vijay Kumar shared interesting things about her divorce
Vanitha Vijay Kumar

ఓ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వ‌నిత విజ‌య్ కుమార్ మాట్లాడుతూ.. త‌మ త‌ల్లి మంజుల రాత్రి, ప‌గ‌లు తేడా లేకుండా షూటింగ్స్‌కు వెళ్లి క‌ష్ట‌ప‌డుతూ త‌మ కోసం డ‌బ్బు సంపాదిస్తుంటుంద‌ని తెలిపింది. అయితే త‌మ‌కు ఆస్తులు స‌మానంగా రావ‌ల్సి ఉన్నా.. త‌న తండ్రి విజ‌య్ కుమార్ మాత్రం ఇవ్వ‌న‌ని అంటున్నాడ‌ని తెలిపింది. త‌న‌మీద ఆయ‌న కేసులు పెట్టాడ‌ని తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలోనే త‌న ఆస్తుల విష‌య‌మై సుప్రీం కోర్టు దాకా వెళ్లాన‌ని చెప్పింది.

కేవ‌లం త‌న తండ్రికి మాత్ర‌మే కాదు, ఇంట్లో అంద‌రికీ తానంటే ఇష్టం ఉండ‌ద‌ని వ‌నిత తెలియ‌జేసింది. ఇత‌రులు ఎవ‌రైనా త‌న గురించి త‌న కుటుంబ స‌భ్యుల‌ను అడిగితే వారు నన్ను త‌మ ఫ్యామిలీ కాద‌ని చెబుతార‌ని.. ఇది త‌న‌ను అత్యంత బాధ‌కు గురి చేస్తుంద‌ని చెప్పింది. తాను అంటే త‌న ఇంట్లో వాళ్ల‌కే ఎందుకు ఇష్టం ఉండ‌దో ఇప్ప‌టికీ అర్థం కావ‌డం లేద‌ని చెప్పుకొచ్చింది.

త‌న‌ను అడ్ర‌స్ లేకుండా చేస్తాన‌ని త‌న తండ్రి అన్నాడ‌ని వనిత చెప్పింది. త‌న త‌ల్లి ఇంట్లో నుంచి త‌న‌ను గెంటేశార‌ని, క‌ట్టుబ‌ట్ట‌ల‌తో ఇంటి నుంచి పిల్ల‌ల‌ను బ‌య‌ట‌కు తీసుకుని వ‌చ్చాన‌ని.. ఎన్నో ఇబ్బందులు ప‌డ్డాన‌ని.. ప్ర‌స్తుతం త‌న‌ను త‌మిళ ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అందుకు వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాన‌ని చెప్పింది.

త‌న‌కు చిన్న త‌నంలోనే పెళ్లి అయింద‌ని, అది త‌న జీవితంపై ప్ర‌భావం చూపించింద‌ని.. అందుక‌నే తాను చేసుకున్న వివాహాలు ఎక్కువ కాలం నిల‌బ‌డ‌డం లేద‌ని ఆమె తెలియ‌జేసింది. ఆమెకు ఇప్ప‌టి వ‌ర‌కు మూడు పెళ్లిళ్లు జ‌రిగాయి కానీ వివాహ బంధం నిల‌బ‌డలేదు. అయితే ఎదుటి వారి కోసం త‌న తీరును మార్చుకోలేన‌ని ఆమె ఖ‌రాఖండిగా చెప్పేసింది. త‌న‌ను చూసి కొంద‌రు త‌న‌కు పొగ‌రని అంటుంటార‌ని, అయినా ఆ మాట‌ల‌ను లెక్క చేయ‌న‌ని స్ప‌ష్టం చేసింది.

కాగా వ‌నిత విజ‌య్ కుమార్ ప‌లు చిత్రాల్లో న‌టించి అల‌రించింది. ఈమె కోడిరామ‌కృష్ణ చిత్రం దేవి లో సుశీల పాత్ర పోషించింది. ప్ర‌స్తుతం త‌మిళంలో ఈమె ప‌లు చిత్రాలు చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment