Chethana : నటుడిగానే గాక రచయితగా ఎంతో టాలెంట్ ఉన్న ఉత్తేజ్.. పలు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మనీ మనీ, అంతం, రాత్రి, ఖడ్గం, నిన్నే పెళ్ళాడతా, డేంజర్ లాంటి సినిమాలకు సంభాషణలు రాసిన ఆయన.. మొత్తం 200 కు పైగా చిత్రాల్లో నటించారు. ఇటీవల ఆయన సతీమణి పద్మావతి అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ విషయం ఇండస్ట్రీలో అందర్నీ కలచివేసింది. మెగాస్టార్ చిరంజీవి హుటాహుటిన బసవతారకం క్యాన్సర్ హాస్పటల్‌కు వెళ్లి ఉత్తేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఉత్తేజ్- పద్మావతి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. వారి పేర్లు చేతన ఉత్తేజ్, పాట. పెద్దమ్మాయి చేతన బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఓ సినిమాలో హీరోయిన్‌గా కూడా నటించింది. చిన్న కూతురు పాటకి కూడా మంచి టాలెంట్ ఉంది. రీసెంట్‌గా అకీరా నందన్ పియానో వాయిస్తూ ఉండగా, పాట అద్భుతంగా పాడి అందరినీ ఆకర్షించింది.
నటుడు ఉత్తేజ్ కూతురు చేతన త్వరలోనే తల్లి కాబోతుంది. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న ఆమె మెటర్నటీ షూట్ చేసి అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది.
కూతురు పుడితే మా అమ్మ మళ్లీ పుట్టిందని సంతోషిస్తానని, కొడుకు పుట్టినా ఆనందమే.. అని పేర్కొంది. చేతన.. నటుడు రవిరాజాను ప్రేమ వివాహం చేసుకోవడంతో కొంతకాలం పాటు కూతురితో మాట్లాడలేదు ఉత్తేజ్.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…