Tollywood : క్రేజ్ ఉన్నప్పుడు నువ్వు ఎంత డిమాండ్ చేసినా నడుస్తుంది. కానీ చేతిలో ఒక్క సినిమా పెట్టుకొని భారీగా డిమాండ్ చేస్తే, పోయి వేరే సినిమా వెతుక్కోమని.. ఏ నిర్మాత అయినా అంటాడు. ఇప్పుడు ఓ హీరోయిన్ విషయంలో అలాగే జరిగినట్లు తెలుస్తోంది. ఆ హీరోయిన్ ఒకప్పుడు ఆఫర్స్ కావాలని అడిగేది, ఇప్పుడు ఆఫర్ వస్తే మాత్రం డబ్బులను భారీగా డిమాండ్ చేస్తోందట.
సదరు హీరోయిన్ చిన్న హీరో పక్కన చేసిన సినిమా బాక్సాఫీస్ వద్ద క్లిక్ కాలేదు. అయినప్పటికీ ఆ అమ్మడికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. సీనియర్ హీరో పక్కన ఛాన్స్ ఇచ్చారు. రాక రాక ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేసి అవకాశం పుచ్చుకుంటుంది. కానీ ఈ అమ్మడు మాత్రం కూని రాగాలు తీసిందట.
సీనియర్ హీరో పక్కన కాబట్టి కోటిన్నర రూపాయలను డిమాండ్ చేసిందట. క్రేజ్ లేని ఆ హీరోయిన్ అంత డిమాండ్ చేయడానికి కారణం ఏంటంటే, ఆమె సీనియర్ హీరో పక్కన నటించాలి కాబట్టి.. అంతగా డిమాండ్ చేసి ఉంటుందని అనుకుంటున్నారు.
అయితే బేరాలు ఆడినా కూడా రూ.1.25 కోట్లకు తగ్గను గాక తగ్గను అంటోందట. దీంతో చేసేదేం లేక నిర్మాతలు ఆమెకు గుడ్ బై చెప్పి వేరే హీరోయిన్ వెతుకులాటలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతే మరి.. కొందరు తాము ఉన్న స్థితిని అర్థం చేసుకోరు. చివరకు ఇలాగే జరుగుతుంది.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…