Tollywood : రూ.1.25 కోట్లు డిమాండ్ చేసిన హీరోయిన్.. వేరే సినిమా చూసుకోమ‌న్న నిర్మాత‌లు..?

November 16, 2021 3:09 PM

Tollywood : క్రేజ్ ఉన్న‌ప్పుడు నువ్వు ఎంత డిమాండ్ చేసినా న‌డుస్తుంది. కానీ చేతిలో ఒక్క సినిమా పెట్టుకొని భారీగా డిమాండ్ చేస్తే, పోయి వేరే సినిమా వెతుక్కోమ‌ని.. ఏ నిర్మాత అయినా అంటాడు. ఇప్పుడు ఓ హీరోయిన్ విష‌యంలో అలాగే జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఆ హీరోయిన్ ఒక‌ప్పుడు ఆఫ‌ర్స్ కావాల‌ని అడిగేది, ఇప్పుడు ఆఫ‌ర్ వ‌స్తే మాత్రం డ‌బ్బుల‌ను భారీగా డిమాండ్ చేస్తోంద‌ట‌.

Tollywood one heroine demanded rs 1.25 crores producers said no

స‌ద‌రు హీరోయిన్ చిన్న హీరో పక్కన చేసిన సినిమా బాక్సాఫీస్ వద్ద క్లిక్ కాలేదు. అయిన‌ప్ప‌టికీ ఆ అమ్మ‌డికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. సీనియర్ హీరో పక్కన ఛాన్స్ ఇచ్చారు. రాక రాక ఛాన్స్ వ‌స్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేసి అవ‌కాశం పుచ్చుకుంటుంది. కానీ ఈ అమ్మ‌డు మాత్రం కూని రాగాలు తీసింద‌ట‌.

సీనియర్ హీరో ప‌క్క‌న కాబ‌ట్టి కోటిన్న‌ర రూపాయ‌ల‌ను డిమాండ్ చేసిందట. క్రేజ్ లేని ఆ హీరోయిన్ అంత డిమాండ్ చేయ‌డానికి కార‌ణం ఏంటంటే, ఆమె సీనియ‌ర్ హీరో ప‌క్క‌న న‌టించాలి కాబ‌ట్టి.. అంత‌గా డిమాండ్ చేసి ఉంటుంద‌ని అనుకుంటున్నారు.

అయితే బేరాలు ఆడినా కూడా రూ.1.25 కోట్ల‌కు తగ్గను గాక తగ్గను అంటోందట. దీంతో చేసేదేం లేక నిర్మాత‌లు ఆమెకు గుడ్ బై చెప్పి వేరే హీరోయిన్ వెతుకులాట‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అంతే మ‌రి.. కొంద‌రు తాము ఉన్న స్థితిని అర్థం చేసుకోరు. చివ‌ర‌కు ఇలాగే జ‌రుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now