రెమ్యునరేషన్ వద్దు.. లాభాల్లో వాటా ముద్దు! అల్లు అర్జున్ సంచలన నిర్ణయం..

భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు సూపర్‌స్టార్లు స్థిరమైన భారీ ఫీజులకే మొగ్గు చూపుతుండగా, అల్లు అర్జున్‌ మాత్రం లాభాల భాగస్వామ్య విధానాన్ని స్థిరంగా అనుసరిస్తూ భిన్నమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

February 8, 2026 5:07 PM
Icon Star Allu Arjun's new remuneration model in Tollywood.
తన తదుపరి సినిమాల కోసం లాభాల భాగస్వామ్య ఒప్పందం చేసుకున్న అల్లు అర్జున్. Allu Arjun/Instagram.

భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు సూపర్‌స్టార్లు స్థిరమైన భారీ ఫీజులకే మొగ్గు చూపుతుండగా, అల్లు అర్జున్‌ మాత్రం లాభాల భాగస్వామ్య విధానాన్ని స్థిరంగా అనుసరిస్తూ భిన్నమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. సినిమా బిజినెస్ పనితీరుతోనే తన ఆదాయం నేరుగా అనుసంధానమయ్యేలా ఈ మోడల్‌ను ఆయన అమలు చేస్తున్నారు. ఈ విధానాన్ని గతంలో బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ఖాన్ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. సినిమా విడుదలకు ముందు భారీ పారితోషికం తీసుకోకుండా, మొత్తం బిజినెస్‌లో వాటా పొందుతూ, విడుదల అనంతరం ప్రధాన ఆదాయాన్ని పొందడం ఈ మోడల్ ప్రత్యేకత. ఇప్పుడు అదే మార్గాన్ని అల్లు అర్జున్ తన రాబోయే సినిమాల కోసం దృఢంగా అమలు చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఒక్కో సినిమాకు రూ.300 కోట్ల ఆదాయం..

ప్రస్తుతం అల్లు అర్జున్ AA22 చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు దర్శకుడు అట్లీ, నిర్మాతగా సన్ పిక్చ‌ర్స్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన AA23 కోసం దర్శకుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ తో చేతులు కలపనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించనుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ రెండు చిత్రాలకూ అల్లు అర్జున్ సుమారు రూ.170 కోట్ల బేస్ పారితోషికాన్ని ఖరారు చేసుకున్నారని తెలుస్తోంది. దీనికి తోడు మొత్తం బిజినెస్‌లో 27 శాతం వాటాను కూడా ఆయన ఒప్పందంలో పొందారు. ఈ ఫార్ములా ప్రకారం, బాక్సాఫీస్ వసూళ్లను బట్టి ఒక్కో సినిమా నుంచి ఆయన ఆదాయం రూ.300 కోట్ల దాకా చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

ఈ లాభాల భాగస్వామ్య వ్యూహంతో అల్లు అర్జున్ తన సమకాలీన నటుల కంటే ముందంజలో నిలుస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పారితోషికం మాత్రమే కాదు, సినిమా విజయంలోనూ నేరుగా భాగస్వామిగా మారే ఈ మోడల్ ద్వారా, తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్‌ల రెమ్యూనరేషన్ విధానానికే కొత్త నిర్వచనం ఇస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment