Upasana : పెళ్ల‌య్యాక చ‌ర‌ణ్ తో ఇబ్బందులు ప‌డ్డా.. అడ్జ‌స్ట్ అయి జీవిస్తున్నా : ఉపాస‌న

June 11, 2022 4:47 PM

Upasana : మెగా కోడ‌లుగా పేరుగాంచిన ఉపాస‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమెకు అటు పుట్టింటి నుంచి, ఇటు మెట్టింటి నుంచి ఎంతో బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌ప్ప‌టికీ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అపోలో హాస్పిట‌ల్స్ నిర్వ‌హ‌ణ‌ను చూసుకోవ‌డ‌మే కాదు.. మ‌రోవైపు సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లోనూ ఈమె చురుగ్గా పాల్గొంటున్నారు. మూగ‌జీవాల ప‌ట్ల జాలి, ద‌య చూపిస్తుంటారు. జూ పార్క్‌లో ఇప్ప‌టికే ప‌లు జీవాల‌ను ద‌త్తత చేసుకుని వాటి పోష‌ణ బాధ్య‌త‌ల‌ను చూస్తున్నారు. అలాగే 200కు పైగా అనాథ‌, వృద్ధాశ్ర‌మాల‌కు ఆమె స‌హాయం చేస్తున్నారు. ఇలా ఉపాస‌న అత్తిల్లు, పుట్టిల్లు వారి పేరును నిల‌బెడుతున్నారు.

అయితే రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న తాజాగా త‌మ 10వ పెళ్లి రోజును పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారు వెకేష‌న్‌కు వెళ్లారు. అయితే ఓ ఇంట‌ర్వ్యూలో ఉపాస‌న మాట్లాడుతూ షాకింగ్ విష‌యాల‌ను వెల్ల‌డించారు. తాను చిన్న‌ప్ప‌టి నుంచి ఎంతో స్వేచ్ఛ‌గా పెరిగాన‌ని.. త‌న‌కు ఇంట్లో ఎంతో స్వేచ్ఛ ఉండేద‌ని అన్నారు. ఈ స‌మాజంలో న‌మ్మ‌కంగా ఎలా జీవించాలో త‌న త‌ల్లిదండ్రులు త‌న‌కు నేర్పించార‌ని.. అందువ‌ల్లే త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డి జీవించ‌గ‌లుగుతున్నాన‌ని అన్నారు.

Upasana says she faced problems with Charan when they married
Upasana

ఇక త‌న జీవితంపై త‌న తండ్రి ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని ఉపాస‌న తెలిపారు. అయిన‌ప్ప‌టికీ ధైర్యంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డాన్ని ఆయ‌న నుంచే నేర్చుకున్నాన‌ని వెల్ల‌డించారు. ఇత‌రుల‌ను ప్రేమించ‌డం, ఆప్యాయ‌త చూపించ‌డం వంటి అనేక విష‌యాల‌ను త‌న తండ్రి ద్వారానే నేర్చుకున్నాన‌ని అన్నారు. అయితే తాను చ‌ర‌ణ్‌ను పెళ్లి చేసుకున్నాక ప‌రిస్థితులు మారిపోయాయ‌ని.. ఆరంభంలో చ‌ర‌ణ్‌తో ఇబ్బందులు ప‌డ్డాన‌ని.. కానీ ఆయ‌న‌ను పెళ్లి చేసుకోవ‌డం త‌న అదృష్టం అని తెలిపారు. అలాగే అన్ని విషయాల్లోనూ అడ్జ‌స్ట్ అయి జీవిస్తున్నాన‌ని ఉపాస‌న తెలిపారు. కాగా ఉపాస‌న చేసిన ఈ కామెంట్స్ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment