Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సతీమణి ఉపాసన ఈ మధ్య ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆమె షేర్ చేసిన ఓ ఫొటో వివాదానికి కారణమైంది. ఓ ఆలయ గోపురంపై మనుషులు ఉన్నట్లుగా ఎడిట్ చేసిన ఓ ఫొటోను ఆమె షేర్ చేసింది. దీంతో ఆమెను నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తూ ట్రోల్ చేశారు. అయితే ఉపాసన తాజాగా ఓ ఫొటోను షేర్ చేసి మళ్లీ వార్తల్లో నిలిచారు.
అయితే ఉపాసన తాజాగా షేర్ చేసింది తన ఫొటోనే. అచ్చమైన సంప్రదాయబద్దమైన వేషధారణలో చీరకట్టుతో క్యూట్ లుక్స్‌లో ఆమె దర్శనమిస్తున్నారు. అదే ఫొటోను ఆమె షేర్ చేశారు. సాధారణంగా ఆమె బిజినెస్ సూట్స్ లేదా చుడీదార్‌లలో దర్శనిమస్తుంటారు. కానీ తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో ఆమె చీరకట్టు ఫొటో వైరల్ గా మారింది.
ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె.. ఫ్రీడమ్ స్టెమ్స్ ఫ్రమ్ ది ఇన్‌సైడ్.. బీ ఫ్రీ, ఫియర్‌లెస్, ఫ్లోరిష్.. అనే కామెంట్ పెట్టారు. మీ ఇష్టమైన వస్త్రధారణలో మీరు ఉండండి, స్వేచ్ఛగా జీవించండి, ఎవరికీ భయపడాల్సిన పనిలేదు.. అంటూ ఆమె కాప్షన్ పెట్టారు.
ఇక రిపబ్లిక్ డే నాడు షేర్ చేసిన ఫొటోకు కొందరు విమర్శించడంతో దానికి కౌంటర్‌గానే ఆమె ఈ ఫోటోను షేర్ చేశారా..? అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఉపాసన చీరకట్టు ఫొటో మాత్రం ఎంతో ఆకర్షణీయంగా ఉందని అంటున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…