Unstoppable With NBK : బాల‌య్య షోలో ద‌డ‌ద‌డ‌లాడించ‌నున్న న‌వ్వుల రారాజు.. క‌న్‌ఫాం..!

December 1, 2021 12:35 PM

Unstoppable With NBK : మెగా నిర్మాత అల్లు అర‌వింద్ ఆహా అనే తెలుగు ఓటీటీ సంస్థ‌ని లాంచ్ చేసి ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే అల్లు అరవింద్ వ్యాపారంలో తన వంతుగా భాగమై అన్‌స్టాపబుల్ అంటూ స్పీడు పెంచారు నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు ఆ స్పీడుకు నవ్వుల రారాజు బ్రహ్మానందాన్ని యాడ్ చేయబోతున్నట్టు కొన్నాళ్లుగా వార్త‌లు రాగా, దీనిపై అధికారిక‌ ప్ర‌కట‌న చేశారు.

Unstoppable With NBK : బాల‌య్య షోలో ద‌డ‌ద‌డ‌లాడించ‌నున్న న‌వ్వుల రారాజు.. క‌న్‌ఫాం..!

బాల‌య్య టాక్ షోకు మొదటి ఎపిసోడ్‌ గెస్ట్‌గా డైలాగ్ కింగ్ మోహన్ బాబు హాజరై సందడి చేశారు. సీనియర్ నటులైన బాలకృష్ణ, మోహన్ బాబు మధ్య నడిచిన మాటల ప్రవాహం జనాన్ని బాగా ఆకర్షించింది. ఆ తర్వాత రెండో ఎపిసోడ్‌లో నాచురల్ స్టార్ నానితో బాలయ్య హంగామా నడించింది. ఇక ఇప్పుడు బ్రహ్మానందం వంతు వచ్చింది. బ్ర‌హ్మీతోపాటు అనిల్ రావిపూడి కూడా జ‌త క‌ట్ట‌గా, వీరు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా ఎంట‌ర్‌టైన్ చేస్తారో చూడాలి.

అఖండ షూటింగ్‌లో జరిగిన ప్ర‌మాదం వ‌ల్ల‌ చేతికి గాయం కావడంతో బాల‌య్య కొంత కాలం పాటు షోకి బ్రేక్ ఇచ్చారు. ఆయన కాస్త కోలుకోవడంతో గత శుక్రవారం తిరిగి షూటింగ్ షురూ చేశారు. మరింత ఉత్సాహంతో, రెట్టింపు ఎనర్జీతో బాలయ్య బాబు ఈజ్ బ్యాక్.. అంటూ ఆహా టీం అధికారిక ప్రకటన ఇచ్చేసింది. ఇక సెల‌బ్స్ తో బాల‌య్య చేసే ర‌చ్చ వేరే లెవ‌ల్‌లో ఉంటుంద‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment