Under 19 Cricket World Cup 2022 : కూలిడ్జ్ లో జరిగిన అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ 2022 టోర్నీ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను భారత్ చిత్తు చేసింది. ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. ఇలా వరల్డ్ కప్ ఫైనల్స్‌లోకి వెళ్లడం.. అండర్ 19 జట్టుకు ఇది వరుసగా నాలుగోసారి. భారత్ నిర్దేశించిన 291 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా తడబడింది. ఈ క్రమంలో ఆసీస్ జట్టుపై భారత్ 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత అండర్ 19 జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలోనే భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో కెప్టెన్ యశ్ ధుల్ సెంచరీ (110)తో కదం తొక్కాడు. మరో బ్యాట్స్‌మన్ షేక్ రషీద్ (94) కూడా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో జాక్ నిస్బెట్, విలియమ్ సాల్జ్‌మన్‌లు చెరో 2 వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 41.5 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. 194 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లలో లచ్‌లన్ షా 51 పరుగులు చేయగా, కోరే మిల్లర్ 38, క్యాంప్‌బెల్ కెల్లావే 30 పరుగులు చేశాడు. మిగిలిన ఎవరూ రాణించలేకపోయారు. భారత బౌలర్లలో విక్కీ ఓస్ట్‌వాల్ 3 వికెట్లు పడగొట్టాడు. నిషాంత్ సింధు, రవికుమార్‌లు చెరో 2 వికెట్లు తీశారు. కౌశల్ తంబె, రఘువంశీలు చెరొక వికెట్ తీశారు.
కాగా ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఫైనల్‌కు చేరిన భారత్ ఈ నెల 5వ తేదీన ఇంగ్లండ్‌తో మ్యాచ్ ఆడనుంది. ఆ రోజు సాయంత్రం 6.30 గంటలకు ఈ ఫైనల్ మ్యాచ్ ప్రసారం కానుంది. స్టార్ స్పోర్ట్స్‌లో మ్యాచ్ ను వీక్షించవచ్చు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…