IPL : ఐపీఎల్ 2022 మెగా వేలానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో ఈ మెగావేలం జరగనుంది. ఇందులో 1200కు పైగా దేశీయ, విదేశీయ ప్లేయర్లకు వేలం వేయనున్నారు. వారిలో 800 మంది దేశీయ ప్లేయర్లు ఉండా.. 400 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. ఇక ఇప్పటికే జట్లు కొంత మంది ప్లేయర్లను రిటెయిన్ చేసుకున్నాయి. వారి వివరాలు ఇలా ఉన్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్.. జడేజా, ధోనీ, గైక్వాడ్, మొయిన్ అలీలను దగ్గరే పెట్టుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రస్సెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్‌లను రిటెయిన్ చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రిషబ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, నోర్‌జె లను రిటెయిన్ చేసుకుంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వద్ద కోహ్లి, మాక్స్‌వెల్, సిరాజ్ లు ఉన్నారు. ముంబై ఇండియన్స్ వద్ద రోహిత్ శర్మ, బుమ్రా, సూర్య కుమార్ యాదవ్, పొల్లార్డ్‌లు ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ వద్ద సంజు శాంసన్, జాస్ బట్లర్, జైశ్వాల్‌లు ఉన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద కేన్ విలియమ్సన్, సమద్, యు.మాలిక్‌లు ఉన్నారు.
పంజాబ్ కింగ్స్ జట్టు వద్ద మయాంక్ అగర్వాల్, అర్షదీప్‌లు ఉన్నారు. అహ్మదాబాట్ టీమ్ హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, గిల్‌లను ఎంచుకుంది. లక్నో సూపర్ జియాంట్స్ జట్టు కేఎల్ రాహుల్, స్టాయినిస్, బిష్ణోయ్‌లను ఎంపిక చేసుకుంది.
ఇక మెగా వేలంలో ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు గాను ఒక్కో జట్టు వద్ద ఇంకా ఎంత డబ్బు మిగిలి ఉందో ఇప్పుడు చూద్దాం. చెన్నై వద్ద రూ.48 కోట్లు, కోల్‌కతా వద్ద రూ.48 కోట్లు, ఢిల్లీ వద్ద రూ.47.5 కోట్లు ఉన్నాయి. బెంగళూరు వద్ద రూ.57 కోట్లు, ముంబై వద్ద రూ.48 కోట్లు, రాజస్థాన్ వద్ద రూ.62 కోట్లు ఇంకా మిగిలి ఉన్నాయి. హైదరాబాద్ వద్ద ప్లేయర్లను కొనేందుకు ఇంకా రూ.68 కోట్లు ఉండగా.. పంజాబ్ వద్ద రూ.72 కోట్లు బ్యాలెన్స్ ఉన్నాయి. అహ్మదాబాద్ వద్ద రూ.52 కోట్లు ఉండగా, లక్నో వద్ద రూ.58 కోట్లు ఉన్నాయి.
జట్లన్నీ తమ వద్ద మిగిలిన మొత్తంతోనే ప్లేయర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ నెల 12, 13 తేదీల్లో జరగనున్న వేలంలో ఏయే జట్లు ఏయే ప్లేయర్లను కొనుగోలు చేస్తాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…