Under 19 Cricket World Cup 2022 : ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భార‌త్‌.. ఫైన‌ల్స్‌లోకి ప్ర‌వేశం..

February 3, 2022 8:02 AM

Under 19 Cricket World Cup 2022 : కూలిడ్జ్ లో జ‌రిగిన అండ‌ర్ 19 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2022 టోర్నీ రెండో సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను భార‌త్ చిత్తు చేసింది. ఫైన‌ల్స్‌లోకి దూసుకెళ్లింది. ఇలా వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్‌లోకి వెళ్ల‌డం.. అండ‌ర్ 19 జ‌ట్టుకు ఇది వ‌రుస‌గా నాలుగోసారి. భార‌త్ నిర్దేశించిన 291 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఆస్ట్రేలియా త‌డ‌బ‌డింది. ఈ క్ర‌మంలో ఆసీస్ జ‌ట్టుపై భార‌త్ 96 ప‌రుగుల భారీ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

Under 19 Cricket World Cup 2022  india won by 96 runs against australia
Under 19 Cricket World Cup 2022

మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త అండ‌ర్ 19 జ‌ట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్ర‌మంలోనే భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 290 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట్స్‌మెన్‌ల‌లో కెప్టెన్ య‌శ్ ధుల్ సెంచ‌రీ (110)తో క‌దం తొక్కాడు. మ‌రో బ్యాట్స్‌మన్ షేక్ ర‌షీద్ (94) కూడా ఆక‌ట్టుకున్నాడు. ఈ క్రమంలో భార‌త్ భారీ స్కోరు చేయ‌గ‌లిగింది. ఆసీస్ బౌల‌ర్ల‌లో జాక్ నిస్బెట్‌, విలియ‌మ్ సాల్జ్‌మ‌న్‌లు చెరో 2 వికెట్లు తీశారు.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 41.5 ఓవ‌ర్ల‌లోనే ఆలౌట్ అయింది. 194 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ల‌లో ల‌చ్‌ల‌న్ షా 51 ప‌రుగులు చేయ‌గా, కోరే మిల్ల‌ర్ 38, క్యాంప్‌బెల్ కెల్లావే 30 ప‌రుగులు చేశాడు. మిగిలిన ఎవ‌రూ రాణించ‌లేకపోయారు. భార‌త బౌల‌ర్ల‌లో విక్కీ ఓస్ట్‌వాల్ 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. నిషాంత్ సింధు, ర‌వికుమార్‌లు చెరో 2 వికెట్లు తీశారు. కౌశ‌ల్ తంబె, ర‌ఘువంశీలు చెరొక వికెట్ తీశారు.

కాగా ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఫైన‌ల్‌కు చేరిన భార‌త్ ఈ నెల 5వ తేదీన ఇంగ్లండ్‌తో మ్యాచ్ ఆడ‌నుంది. ఆ రోజు సాయంత్రం 6.30 గంట‌ల‌కు ఈ ఫైన‌ల్ మ్యాచ్ ప్ర‌సారం కానుంది. స్టార్ స్పోర్ట్స్‌లో మ్యాచ్ ను వీక్షించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now