TVS Jupiter 125 : కొత్త టీవీఎస్ జూపిట‌ర్ 125 ని చూశారా ? ధ‌ర‌, స‌దుపాయాలు ఎలా ఉన్నాయంటే ?

October 8, 2021 2:16 PM

TVS Jupiter 125 : టీవీఎస్ సంస్థ కొత్త జూపిట‌ర్ 125ని విడుద‌ల చేసింది. దీని ఎక్స్ షోరూం ధ‌ర రూ.73,400గా ఉంది. ఇందులో కొత్త ఇంజిన్‌ను ఏర్పాటు చేయ‌గా, డిస్క్‌, డ్ర‌మ్, డ్ర‌మ్ అలాయ్ వేరియెంట్ల‌లో దీన్ని అందిస్తున్నారు.

TVS Jupiter 125 new model launched know the features and price

టీవీఎస్ జూపిట‌ర్ దేశంలో అమ్ముడ‌తున్న ఉత్త‌మ స్కూట‌ర్ల‌లో ఒక‌టి. ఇప్ప‌టికే 45 ల‌క్ష‌ల‌కు పైగా యూనిట్ల‌ను విక్ర‌యించింది. 2013 నుంచి ఈ మోడ‌ల్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. కొత్త టీవీఎస్ జూపిట‌ర్ 125 ఎక్స్ షోరూం ధ‌ర రూ.73,400గా ఉంది.

టీవీఎస్ జూపిట‌ర్ 125కు చెందిన ప‌లు మోడ‌ల్స్ ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. డ్ర‌మ్ మోడ‌ల్ ఎక్స్ షోరూం ధ‌ర రూ.73,400 ఉండ‌గా, డ్ర‌మ్ అలాయ్ మోడ‌ల్ ధ‌ర రూ.76,800గా ఉంది. డిస్క్ మోడ‌ల్ ఎక్స్ షోరూం ధ‌ర రూ.81,300గా ఉంది.

కొత్త జూపిట‌ర్ 125లో 33 లీట‌ర్ల అండ‌ర్ సీట్ స్టోరేజ్ కెపాసిటీని అందిస్తున్నారు. ఫ్యుయ‌ల్ ఫిల్ల‌ర్ బ‌య‌ట‌కు ఉంటుంది. మొబైల్ చార్జ‌ర్‌, సెమి డిజిట‌ల్ ఇన్‌స్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్‌, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్‌, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్‌, 3 స్టెప్ అడ్జ‌స్ట‌బుల్ రియ‌ర్ షాక్‌, సైడ్ స్టాండ్ ఇండికేట‌ర్ వంటి స‌దుపాయాలు ఈ స్కూట‌ర్‌లో ల‌భిస్తున్నాయి.

క‌స్ట‌మ‌ర్లు డ్ర‌మ్ లేదా డిస్క్ మోడ‌ల్స్ ను అలాయ్ వీల్స్ తో తీసుకోవ‌చ్చు. ఇక ఈ స్కూట‌ర్‌లో టీవీఎస్‌కు చెందిన సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్ట‌మ్ (ఎస్‌బీటీ)ని అందిస్తున్నారు.

TVS Jupiter 125 : బెస్ట్ మైలేజ్ ఇస్తుంద‌ని ప్ర‌క‌టించింది..

ఈ స్కూట‌ర్‌లో 124.8 సిసి ఇంజిన్ ఉంది. 8 బీహెచ్‌పీ సామ‌ర్థ్యం ల‌భిస్తుంది. ఆటోమేటిక్ సీవీటీ గేర్ బాక్స్‌ను అందిస్తున్నారు. ఇంటెల్లిగో టెక్నాల‌జీ స‌దుపాయం ఉంది. దీని వ‌ల్ల వెహికిల్ ఐడిల్ గా ఉన్న‌ప్పుడు ఇంజిన్ ఆగిపోతుంది. ఇక టీవీఎస్ కంపెనీ ఈ స్కూట‌ర్ బెస్ట్ మైలేజ్ ఇస్తుంద‌ని ప్ర‌క‌టించింది. కానీ ఎంత ఇస్తుంద‌నే వివ‌రాల‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు.

టీవీఎస్ జూపిట‌ర్ 125 ఇదే విభాగంలోని హీరో డెస్టిని 125, హోండా యాక్టివా 125, సుజుకి యాక్సెస్ 125, హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125 వంటి స్కూట‌ర్ల‌కు గ‌ట్టి పోటీనివ్వ‌నుంది. కొత్త టీవీఎస్ జూపిట‌ర్ 125కు గాను దేశ‌వ్యాప్తంగా బుకింగ్స్ ను ప్రారంభించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment