Pooja Hegde : బుట్ట‌బొమ్మ పూజా హెగ్డెను వ‌ద‌ల‌ని త్రివిక్ర‌మ్‌..!

February 4, 2022 12:56 PM

Pooja Hegde : సాధార‌ణంగా సినీ రంగంలో కొన్ని కాంబినేష‌న్స్ ను రిపీట్ చేసి కొంద‌రు స‌క్సెస్ సాధిస్తుంటారు. అయితే ఇది అనివార్య ప‌రిస్థితుల్లోనే చేస్తారు. ఏ సినిమా తీసినా హిట్ కాక‌పోతే క‌నీసం కాంబినేష‌న్‌లో అయినా హిట్ అవుతుందేమోన‌ని అలా చేస్తుంటారు. కానీ స‌హ‌జంగానే ఏ ద‌ర్శ‌క నిర్మాత కూడా ఒక‌సారి సినిమా తీసిన హీరో లేదా హీరోయిన్‌తో వెంట వెంట‌నే సినిమాలు తీయ‌రు. అయితే ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాత్రం ఇందుకు పూర్తిగా వ్య‌తిరేకంగా వెళ్తున్నారు. ఆయ‌న త‌న వ‌రుస చిత్రాల్లో బుట్ట బొమ్మ పూజా హెగ్డెనే హీరోయిన్ గా తీసుకుంటున్నారు. దీంతో ఆయ‌న‌పై సోష‌ల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

trivikram is not leaving Pooja Hegde
Pooja Hegde

ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో తీసిన అజ్ఞాత వాసి చిత్రం ఫెయిల్ అయింది. ఈక్ర‌మంలోనే త్రివిక్ర‌మ్ ఎన్‌టీఆర్‌తో క‌లిసి అర‌వింద స‌మేత చిత్రాన్ని తీశారు. అయితే ఆ మూవీలో పూజా హెగ్డెను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను సాధించింది. దీంతో త్రివిక్ర‌మ్ సెంటిమెంట్‌గా మ‌ళ్లీ త‌న సినిమాలో పూజా హెగ్డెనే తీసుకున్నారు. ఆ త‌రువాత వ‌చ్చిన అల వైకుంఠ పుర‌ములో సినిమాలోనూ పూజా హెగ్డె న‌టించింది. ఆ మూవీ కూడా హిట్ అయింది. దీంతో పూజా గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఆమె ఇత‌ర హీరోల‌తో తీసిన చిత్రాలు కూడా హిట్ అయ్యాయి. దీంతో పూజాకు వ‌రుస ఆఫ‌ర్లు వ‌చ్చాయి.

అయితే సెంటిమెంట్‌ను రిపీట్ చేద్దాం అనుకున్నారో, ఏమోగానీ.. త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ త‌న త‌దుప‌రి మూవీలో పూజా హెగ్డెనే తీసుకున్నారు. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కించనున్న చిత్రంలో పూజాను త్రివిక్ర‌మ్ హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ చిత్ర లాంచింగ్ తాజాగా హైద‌రాబాద్‌లో జ‌రిగింది. త్వ‌ర‌లోనే షూటింగ్‌ను మొద‌లు పెట్ట‌నున్నారు.

అయితే ఇలా పూజాను త్రివిక్ర‌మ్ త‌న సినిమాకు తీసుకోవ‌డం వ‌రుస‌గా ఇది మూడో సారి. దీంతో హ్యాట్రిక్ హిట్ ఖాయ‌మ‌ని కొంద‌రు అంటున్నారు. అలాగే కొంద‌రు మాత్రం ఆయ‌న‌పై సెటైర్లు వేస్తున్నారు. ఇక మీరు పూజా హెగ్డెను వ‌ద‌ల‌రా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మ‌రి ఈసారి ఈ కాంబినేష‌న్ హిట్ ను సాధిస్తుందా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment