Samantha : స‌మంత‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన టాప్ తెలుగు చాన‌ల్ ? తిర‌స్క‌రించిన స‌మంత ?

October 10, 2021 10:11 AM

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకుల అనంత‌రం స‌మంత తీవ్రంగా డిస్ట‌ర్బ్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఆ విష‌యాన్ని ఆమె పోస్టుల‌ను చూసి అర్థం చేసుకోవ‌చ్చు. అయితే కొంత కాలానికి ష‌రా మూమూలే అన్న‌ట్లుగా అంతా స‌ద్దుమ‌ణుగుతుంది. కానీ స‌మంత విడాకుల విష‌యానికి మాత్రం ఇప్ప‌ట్లో ఫుల్‌స్టాప్ ప‌డే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ఎక్క‌డ చూసినా ఆమె గురించే చ‌ర్చ న‌డుస్తోంది.

top telugu tv channel given bumper offer to Samantha she denied it

ఇక నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకున్న అనంత‌రం చాలా మంది స‌మంత‌దే త‌ప్పు అని బ‌హిరంగంగానే విమ‌ర్శిస్తున్నారు. వీరి విడాకుల టాపిక్ ఇప్ప‌టికీ సెన్సేష‌న‌ల్‌గానే మారింది. ప‌లువురు సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు వీరి విడాకుల‌పై త‌మ‌కు తోచిన విధంగా స్పందిస్తున్నారు. అయితే స‌మంత‌కు చెందిన తాజా వార్త ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే..

స‌మంత‌, నాగ‌చైత‌న్య‌ల విడాకుల విష‌యం నేప‌థ్యంలో వారికి ప్ర‌స్తుతం వ‌స్తున్న క్రేజ్ దృష్ట్యా టీఆర్‌పీ రేటింగ్‌ను పెంచుకునేందుకు ఓ టాప్ తెలుగు చాన‌ల్ స‌మంత‌తో ఇంట‌ర్వ్యూ కోసం ప్లాన్ చేసింద‌ట‌. అయితే ఓ మ‌ధ్య‌వ‌ర్తి ద్వారా రాయ‌బారం కూడా న‌డిపార‌ట‌. కానీ ఆ వ్య‌క్తి ద్వారా ఆ చాన‌ల్ పంపిన ఆ ఆఫ‌ర్‌ను స‌మంత తిర‌స్కరించింద‌ట‌.

ప్ర‌స్తుతం స‌మంత, నాగ‌చైత‌న్య‌ల వార్త‌లు వైర‌ల్ అవుతున్న నేప‌థ్యంలో త‌మ చాన‌ల్‌కు టీఆర్‌పీ రేటింగ్ ను పెంచుకోవాల‌నే ఉద్దేశంతోనే ఆ చాన‌ల్ వారు స‌మంత‌తో ఇంట‌ర్వ్యూకు ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. కానీ స‌మంత ఆ ఆఫ‌ర్‌ను తిర‌స్కరించడంతో ఆ చాన‌ల్ వారు ఉసూరుమ‌న్నార‌ట‌.

టీఆర్‌పీ రేటింగ్స్ కోసం టీవీ చాన‌ల్స్ వారు ఏమైనా చేస్తారు. స‌మంత‌తో ఇంట‌ర్వ్యూ తీసుకుని దాన్ని ట్రెండింగ్ చేద్దామ‌ని అనుకున్నారు. కానీ వీలు కాలేదు. మ‌రి ఆమె ఇక ముందు అయినా ఇంట‌ర్వ్యూలు ఇస్తుందా, లేదా.. అన్న‌ది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment