Tollywood : తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వారి కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడం కోసం సెలబ్రెటీలు ఎన్నో అవస్థలు పడతారు. ఈ క్రమంలోనే ఒకసారి వారికి ఇష్టం వచ్చిన తర్వాత వారు ఎంపిక చేసుకొనే ప్రతి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు వహిస్తూనే ఒకవైపు సినిమాలలో దూసుకుపోతూ మరోవైపు వ్యాపార రంగాలలోకి అడుగు పెడుతుంటారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా ఉన్న ఎంతో మంది హీరోలు ప్రస్తుతం సైడ్ బిజినెస్ లు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాల్లో నటిస్తూ మరోవైపు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించడమే కాకుండా ట్రూజెట్ విమాన సర్వీసులను నడుపుతున్నారు. అలాగే నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటూ ఒక పబ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా పబ్ నిర్వహించడమే కాకుండా ఒక మల్టీప్లెక్స్ నిర్మించబోతున్నారు.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించడమే కాకుండా, ఏషియన్ మూవీస్ తో కలిసి ఏఎంబీ మల్టీ ఫ్లెక్స్ థియేటర్ ని నడుపుతున్నారు. ఇక విజయ్ దేవరకొండ ఒక క్లాత్ స్టోర్ నిర్వహిస్తున్నారు. ఆయన కూడా ఒక మల్టీప్లెక్స్ ఉంది.
ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు ఇండస్ట్రీలో దూసుకుపోతున్న మరోవైపు వ్యాపార రంగంలో అడుగుపెట్టి వారు ఏంటో నిరూపించుకున్నారు. అయితే హీరోల అడుగు జాడల్లోనే హీరోయిన్స్ కూడా వ్యాపార రంగాలలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ జిమ్ లు పెట్టి నిర్వహిస్తుండగా.. సమంత సాకి పేరిట దుస్తుల బ్రాండ్‌ను నడుపుతోంది. అలాగే తమన్నా ఆభరణాల షాప్ ను నిర్వహిస్తోంది. ఈక్రమంలోనే హీరోయిన్లు కూడా హీరోలకు పోటీగా రెండు చేతులా సంపాదిస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…