Tollywood : వామ్మో.. ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఉన్న వీరికి ఇన్ని సైడ్ బిజినెస్ లు ఉన్నాయా..?

November 3, 2021 11:29 PM

Tollywood : తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వారి కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడం కోసం సెలబ్రెటీలు ఎన్నో అవస్థలు పడతారు. ఈ క్రమంలోనే ఒకసారి వారికి ఇష్టం వచ్చిన తర్వాత వారు ఎంపిక చేసుకొనే ప్రతి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు వహిస్తూనే ఒకవైపు సినిమాలలో దూసుకుపోతూ మరోవైపు వ్యాపార రంగాలలోకి అడుగు పెడుతుంటారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా ఉన్న ఎంతో మంది హీరోలు ప్రస్తుతం సైడ్ బిజినెస్ లు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.

Tollywood these heroes in tollwood got their own businesses

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాల్లో నటిస్తూ మరోవైపు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించడమే కాకుండా ట్రూజెట్ విమాన సర్వీసులను నడుపుతున్నారు. అలాగే నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటూ ఒక పబ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా పబ్ నిర్వహించడమే కాకుండా ఒక మల్టీప్లెక్స్ నిర్మించబోతున్నారు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించడమే కాకుండా, ఏషియన్ మూవీస్ తో కలిసి ఏఎంబీ మల్టీ ఫ్లెక్స్ థియేటర్ ని నడుపుతున్నారు. ఇక విజయ్ దేవరకొండ ఒక క్లాత్ స్టోర్ నిర్వహిస్తున్నారు. ఆయన కూడా ఒక మల్టీప్లెక్స్‌ ఉంది.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు ఇండస్ట్రీలో దూసుకుపోతున్న మరోవైపు వ్యాపార రంగంలో అడుగుపెట్టి వారు ఏంటో నిరూపించుకున్నారు. అయితే హీరోల అడుగు జాడల్లోనే హీరోయిన్స్ కూడా వ్యాపార రంగాలలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జిమ్‌ లు పెట్టి నిర్వహిస్తుండగా.. సమంత సాకి పేరిట దుస్తుల బ్రాండ్‌ను నడుపుతోంది. అలాగే తమన్నా ఆభరణాల షాప్ ను నిర్వహిస్తోంది. ఈక్రమంలోనే హీరోయిన్లు కూడా హీరోలకు పోటీగా రెండు చేతులా సంపాదిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now