Vijay Sethupathi : ఒక్కోసారి సెలబ్రిటీలకు జనాల మధ్య విచిత్ర సమస్యలు ఎదురవుతుంటాయి. మీదకు తోసుకురావడం, దాడి చేయడం వంటివి కూడా చేస్తుంటారు. తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతికి ఎయిర్‌పోర్ట్ లో విచిత్రమైన సంఘటన ఎదురైంది. బెంగళూరు ఎయిర్ పోర్టులో విజయ్ సేతుపతి నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ ఆగంతకుడు వెనుకనుంచి వచ్చి ఎగిరి తన్నాడు.
దీంతో విజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. పక్కనే ఉన్నవారంతా అలెర్ట్ అయ్యారు. ఆ ఆగంతకుడిని పట్టుకున్నారు. ఎయిర్ పోర్ట్ భద్రతా అధికారులు విజయ్ సేతుపతిని క్షేమంగా తీసుకెళ్లినట్టు కనిపిస్తోంది. పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత తమిళ హీరోలు ఎవరూ చివరి చూపుకు రాలేదు కదా కనీసం స్పందించలేదు. దీని వలన కన్నడిగులు కోపంగా ఉన్నారట. ఆ కారణంతోనే విజయ్ సేతుపతిపై దాడి చేశారని అంటున్నారు.
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పాపులారిటీ ఉన్న నటుడు విజయ్ సేతుపతి. పిజ్జా వంటి సినిమాలతో హీరోగానే కాకుండా.. దళపతి విజయ్ హీరోగా చేసిన ‘మాస్టర్’లో విలన్‌గా చేసి తెలుగులో మంచి గుర్తింపు సాధించాడు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ కథనాయకుడిగా చేసిన ‘ఉప్పెన’ సినిమాతో మక్కల్ సెల్వన్ ఇమేజ్ ఇంకా పెరిగింది. హీరోగానే కాకుండా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ పలుభాషలలో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…