Vijay Sethupathi : ఎయిర్‌పోర్ట్‌లో స్టార్ హీరోని కాలితో త‌న్నిన ఆగంత‌కుడు.. రియాక్ష‌న్ ఏంటి ?

November 3, 2021 11:33 PM

Vijay Sethupathi : ఒక్కోసారి సెల‌బ్రిటీల‌కు జ‌నాల మ‌ధ్య విచిత్ర స‌మస్య‌లు ఎదుర‌వుతుంటాయి. మీద‌కు తోసుకురావ‌డం, దాడి చేయ‌డం వంటివి కూడా చేస్తుంటారు. తాజాగా త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తికి ఎయిర్‌పోర్ట్ లో విచిత్ర‌మైన సంఘ‌ట‌న ఎదురైంది. బెంగళూరు ఎయిర్ పోర్టులో విజయ్ సేతుపతి న‌డుచుకుంటూ వెళ్తుండగా.. ఓ ఆగంతకుడు వెనుకనుంచి వచ్చి ఎగిరి తన్నాడు.

Vijay Sethupathi attacked by unknown person at airport

దీంతో విజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. పక్కనే ఉన్నవారంతా అలెర్ట్ అయ్యారు. ఆ ఆగంతకుడిని పట్టుకున్నారు. ఎయిర్ పోర్ట్ భద్రతా అధికారులు విజయ్ సేతుపతిని క్షేమంగా తీసుకెళ్లినట్టు కనిపిస్తోంది. పునీత్ రాజ్ కుమార్ మ‌ర‌ణం త‌ర్వాత త‌మిళ హీరోలు ఎవ‌రూ చివ‌రి చూపుకు రాలేదు క‌దా కనీసం స్పందించ‌లేదు. దీని వ‌ల‌న క‌న్న‌డిగులు కోపంగా ఉన్నార‌ట‌. ఆ కార‌ణంతోనే విజ‌య్ సేతుప‌తిపై దాడి చేశార‌ని అంటున్నారు.

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పాపులారిటీ ఉన్న నటుడు విజయ్‌ సేతుపతి. పిజ్జా వంటి సినిమాలతో హీరోగానే కాకుండా.. దళపతి విజయ్‌ హీరోగా చేసిన ‘మాస్టర్‌’లో విలన్‌గా చేసి తెలుగులో మంచి గుర్తింపు సాధించాడు. మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ కథనాయకుడిగా చేసిన ‘ఉ​ప్పెన’ సినిమాతో మక్కల్‌ సెల్వన్ ఇమేజ్‌ ఇంకా పెరిగింది. హీరోగానే కాకుండా విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గానూ ప‌లుభాష‌ల‌లో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment