Tollywood : చాలా కాలం తర్వాత సినిమాలు వరుసగా థియేటర్లలో విడుదల అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతున్నాయి. ఈ క్రమంలోనే చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ప్రతి వారం విడుదల అవుతూ థియేటర్లకు తిరిగి పూర్వవైభవాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలు థియేటర్లలో విడుదల అయి మంచి గుర్తింపు సంపాదించుకున్నాయి. మరి ఈ వారం మరికొన్ని సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి ప్రేక్షకుల ముందుకు ఈ వారం రాబోతున్న సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే..
యంగ్ హీరో కార్తికేయ నటించిన “రాజా విక్రమార్క” ఈనెల 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అలాగే ఆనంద్ దేవరకొండ నటించిన “పుష్పకవిమానం” నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హీరో శ్రీకాంత్ కేసీఆర్ బయో పిక్ చిత్రంగా తెరకెక్కిన “తెలంగాణ దేవుడు” అనే సినిమా కూడా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సుదీప్ హీరోగా, శివ కార్తీక్ తెరకెక్కించిన చిత్రం ‘కె3 కోటికొక్కడు’, దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న “కురుప్” , ఆమని, గౌతమ్ రాజు, సౌమ్య శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ది ట్రిప్’ చిత్రాలు కూడా నవంబర్ 12వ తేదీన థియేటర్లలో విడుదల కానున్నాయి.
ఇక ఈ వారం థియేటర్లలో కాకుండా ఓటీటీలలో విడుదలయ్యే సినిమాల విషయానికి వస్తే..
ఆహాలో ‘3 రోజెస్’, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో డోప్ సిక్, కనకం కామిని కలహం, జంగిల్ క్రూయిజ్, స్పెషల్ ఆప్స్, షాంగ్-చి, జీ5లో అరణ్మణై 3, స్క్వాడ్, నెట్‌ఫ్లిక్స్ లో రెడ్ నోటీస్ వంటి సినిమాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ఈ వారం ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…