Tollywood : ఈ వారం థియేటర్ లలో, ఓటీటీలలో ప్రేక్షకులను సందడి చేసే సినిమాలివే..!

November 9, 2021 4:59 PM

Tollywood : చాలా కాలం తర్వాత సినిమాలు వరుసగా థియేటర్లలో విడుదల అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతున్నాయి. ఈ క్రమంలోనే చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ప్రతి వారం విడుదల అవుతూ థియేటర్లకు తిరిగి పూర్వవైభవాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలు థియేటర్లలో విడుదల అయి మంచి గుర్తింపు సంపాదించుకున్నాయి. మరి ఈ వారం మరికొన్ని సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి ప్రేక్షకుల ముందుకు ఈ వారం రాబోతున్న సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే..

Tollywood these are the movies releasing this week in theatres and otts

యంగ్ హీరో కార్తికేయ నటించిన “రాజా విక్రమార్క” ఈనెల 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అలాగే ఆనంద్‌ దేవరకొండ నటించిన “పుష్పకవిమానం” నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  హీరో శ్రీకాంత్ కేసీఆర్ బయో పిక్ చిత్రంగా తెరకెక్కిన “తెలంగాణ దేవుడు” అనే సినిమా కూడా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సుదీప్ హీరోగా, శివ కార్తీక్‌ తెరకెక్కించిన చిత్రం  ‘కె3 కోటికొక్కడు’, దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్న “కురుప్‌” ,  ఆమని, గౌతమ్‌ రాజు,  సౌమ్య శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ది ట్రిప్‌’ చిత్రాలు కూడా నవంబర్ 12వ తేదీన థియేటర్లలో విడుదల కానున్నాయి.

ఇక ఈ వారం థియేటర్లలో కాకుండా ఓటీటీలలో విడుదలయ్యే సినిమాల విషయానికి వస్తే..

 ఆహాలో ‘3 రోజెస్’,  డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ లో డోప్‌ సిక్, కనకం కామిని కలహం, జంగిల్‌ క్రూయిజ్‌, స్పెషల్‌ ఆప్స్‌, షాంగ్‌-చి, జీ5లో అరణ్మణై 3, స్క్వాడ్‌, నెట్‌ఫ్లిక్స్‌ లో రెడ్‌ నోటీస్‌ వంటి సినిమాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ఈ వారం ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now