Prabhas : ప్రభాస్ దెబ్బకు భయపడిపోతున్న టాలీవుడ్ నిర్మాతలు ?

October 4, 2021 8:14 PM

Prabhas : పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన నటించిన సినిమాలన్నీ పాన్ ఇండియా చిత్రాలు కావడంతో అధిక భారీ బడ్జెట్ చిత్రాలను ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ కూడా పలువురు నిర్మాతలతో భారీ బడ్జెట్ చిత్రాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.

Prabhas : ప్రభాస్ దెబ్బకు భయపడిపోతున్న టాలీవుడ్ నిర్మాతలు ?

ఇకపోతే ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ తో సినిమాలు తీయాలని ఎంతో మంది దర్శక నిర్మాతలు భావించారు. అయితే ప్రస్తుతం హీరో ప్రభాస్ తో సినిమాలు తీయాలంటే భయంతో వెనకడుగు వేస్తున్నారు. ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా చిత్రాలను భారీ బడ్జెట్ లో నిర్మించాల్సి ఉంటుంది. అయితే ప్రభాస్ రెమ్యూనరేషన్ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడంలేదని ఇండస్ట్రీ సమాచారం.

ఎక్కువగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్న ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారుగా రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంత క్రేజ్ ఉన్న ప్రభాస్ తో టాలీవుడ్ నిర్మాతలు సినిమాలు తీయాలంటే వారికి భారంగా మారుతోంది. ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ దర్శకుల కథలు వింటున్నారని.. అయితే రెమ్యునరేషన్ విషయంలో కాస్త తగ్గితే మాత్రం ప్రభాస్ తో సినిమాలు తీయడానికి నిర్మాతలు కూడా ఆసక్తి కనబరిచే అవకాశం ఉందని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now