Tollywood : సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల హవా ఓ రేంజ్ లో ఉంటుంది. వారికున్న హడావిడి, డిమాండ్ ఇండస్ట్రీలో ఇంకెవ్వరికీ ఉండదు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ కి మాత్రం నిర్మాతలు సైతం భయపడుతున్నారు. దర్శకుల పరిస్థితైతే ఇక చెప్పక్కర్లేదు. ఈమె సినీ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో అస్సలు సినిమాలే లేవు. వేరే భాషలో నటించిన సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంతో ఈ బ్యూటీ కెరీర్ కూడా టర్న్ అయ్యింది. తెలుగులో కూడా ఒకటి రెండు అవకాశాలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఈ హీరోయిన్ దర్శక నిర్మాతలకు ఓ రేంజ్ లో నక్షత్రాలను లెక్కపెట్టించింది. ఒక్కరోజు కూడా షూటింగ్ కోసం టైమ్ పాటించలేదు. ఇక షాట్ టైమ్ కి హాజరు కాక ఎన్నో సార్లు ప్యాకప్ చెప్పాల్సి వచ్చిందట. ఇక ఆమె నటించిన సినిమాలను నానా కష్టాలు పడి పూర్తి చేశారు. ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఈ ఫంక్షన్ కి కనుక ఈ హీరోయిన్ రావాలంటే.. తనకు ఫైవ్ స్టార్ హోటల్ లో రూమ్ బుక్ చేయాలని కండిషన్ పెట్టిందట.
ఉన్న ఊర్లోనే ఫంక్షన్ జరుగుతుంటే ఫైవ్ స్టార్ హోటల్ లో రూమ్ ఎందుకు ? అంటూ.. తలలు పట్టుకున్నారు నిర్మాతలు. ఆ ప్రశ్నకు.. ఆమె ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్ళి ఫంక్షన్ కోసం డ్రెస్, మేకప్ వేసుకుని వస్తుందట. ఆ కారణం తెలిశాక నిర్మాతలకు షాక్. అంటే ఆమె ఇంటి నుండి డైరెక్ట్ గా పార్టీ డ్రెస్ తో ఫంక్షన్ కు రారట. ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్ లో కేవలం రెండు గంటల పని కోసం అలా నిర్మాతలతో వేల రూపాయల్ని ఖర్చు చేసిన ఘనత ఆమెకే దక్కింది. ఈ విషయం తెలిసిన వారంతా.. మేడమ్ సార్.. మేడమ్.. అంతే.. అనుకుంటున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…