Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో ఏడోవారం ప్రియ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమోనని అందరూ భావించారు. కానీ సస్పెన్స్ నడుమ ప్రియ ఎలిమినేట్ అయింది. గత వారం నామినేషన్స్‌లో ప్రియ, అనీ మాస్టర్, లోబో, జెస్సీ, రవి, శ్రీరామ్, కాజల్, సిరి ఉండగా.. ప్రియ ఎలిమినేట్ అయింది. అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఇంటి నుంచి ఎలిమినేట్ అయిందని కార్యక్రమ వ్యాఖ్యాత, నటుడు నాగార్జున తెలిపారు.
కెప్టెన్సీ కోసం జరిగిన టాస్క్ లో కంటెస్టెంట్ ప్రియ, వీజే సన్నీ మధ్య వాగ్వాదం నడిచింది. కోడి నుండి గుడ్లు సేకరించడం, వాటిని దాచుకోవడం రసాభాసకు దారితీసింది. ఈ గేమ్ లో ప్రియ బుట్టను చించి వేస్తుంటే, సన్నీ అడ్డుకున్నాడు. ఆమెను పక్కకు తోసేసి బుట్ట తీసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రియ చెంప పగులుద్ది అన్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున కూడా ప్రస్తావనకు తెచ్చారు.
తనను గట్టిగా తోసేశాడని, అందుకే కోపంతో అలా అన్నాను.. అంటూ ప్రియ వివరణ ఇచ్చింది. అయితే ప్రియ ప్రవర్తనే ఆమె కొంపముంచింది. ఆ గొడవలో ప్రియ కాస్త శృతి మించినట్టు కనిపించడంతో ఆమెను ఎలిమినేట్ చేశారని అంటున్నారు. టాస్క్‌లలో ప్రియ.. సన్నీని టార్గెట్ చేయడం, నువ్వు మగాడివే కాదు అని అనడం, ఏం చేసుకుంటావో చేసుకో నీలాంటి వాళ్లను చాలా మందిని చూశాను.. అంటూ దారుణంగా రెచ్చగొట్టడం ప్రియకు నెగెటివ్‌గా మారాయని అంటున్నారు. ముందు అనీ మాస్టర్ డేంజర్ జోన్‌లో ఉండగా, ఆ తర్వాత ప్రియ ప్రవర్తించిన తీరు ఆమెను హౌస్ నుంచి బయటకు వచ్చేలా చేసింది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…