Tollywood : కరోనా వల్ల ఇన్ని రోజులూ సినిమా షూటింగులు అన్నీ వాయిదా పడ్డాయి. అయితే ప్రస్తుతం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకోవడంతో దాదాపుగా పెద్ద సినిమాలన్నీ ఒకేసారి షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల తేదీ కోసం పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే చిన్న హీరోలు నటించిన సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ స్టార్ హీరోల సినిమాలకు విడుదల తేదీలు దొరకకపోవడంతో దర్శక నిర్మాతలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. వారిలో ఆందోళన నెలకొంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు నటించిన పలు సినిమాలు షూటింగ్ లను పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. మరి ఆ సినిమాలు ఏమిటి అనే విషయానికి వస్తే.. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు విడుదల తేదీని ప్రకటించలేదు. అలాగే రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడి చిత్ర నిర్మాణం పూర్తి అయినప్పటికీ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించకపోవడం గమనార్హం.
వీటితో పాటు సాయిపల్లవి, రానా జంటగా నటించిన విరాటపర్వం, వెంకటేష్ మీనా జంటగా తెరకెక్కిన దృశ్యం 2 చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల తేదీలను మాత్రం ప్రకటించలేదు. అలాగే లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగ శౌర్య, రీతువర్మ జంటగా నటించిన వరుడు కావలెను చిత్రం షూటింగ్ పూర్తి అయినప్పటికీ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించలేదు. అయితే ఈ సినిమాలను ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్నట్లు దర్శకులు వెల్లడించినప్పటికీ విడుదల తేదీలను అధికారికంగా ప్రకటించలేదు. కరోనా కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో, రారో.. సినిమాలు ఎలా నడుస్తాయో.. అన్న బెంగ వల్లే వారు చిత్రాలను విడుదల చేసేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…