Priyanka Singh : బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్ గా అడుగుపెట్టిన ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ సాయి తేజ్ గా ఎంట్రీ ఇచ్చి అందరికీ పరిచయమైంది. అయితే జబర్దస్త్ కార్యక్రమంలో ఎక్కువగా లేడీ పాత్రలలో నటించిన సాయి తేజ్ ఆ తర్వాత సర్జరీ ద్వారా అమ్మాయిగా మారిపోయింది.
ఇలా సర్జరీ ద్వారా సాయి తేజ్ నుంచి ప్రియాంక సింగ్ గా మారిన ఈమె స్టేజ్ పై అందరినీ నవ్వించినప్పటికే తన జీవితంలో ఎన్నో విషాద ఘటనలు ఉన్నాయని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. సమాజానికి తాను ఒక అబ్బాయిగా పరిచయం అయినప్పటికీ తనకు అమ్మాయిగా ఉండాలనే కోరిక ఉండేదని చిన్నప్పటి నుంచి తన అక్క దుస్తులు ధరించడం వల్ల తనకు అమ్మాయిగా మారాలనే ఆలోచన బలపడిందని తెలియజేసింది.
ఈ క్రమంలోనే ఈ కోరికను ఇప్పుడు తీర్చుకోకపోతే భవిష్యత్తులో తీర్చుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించిన ప్రియాంక సింగ్ తన స్నేహితుల సహాయంతో లక్షల రూపాయలు ఖర్చు చేసి అమ్మాయిగా మారింది.
అయితే తాను ఎక్కడ సర్జరీ చేయించుకుందీ, ఎంత ఖర్చయిందనే విషయాలను మాత్రం ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచుతున్నట్టు తెలియజేసింది. తాను సర్జరీ ద్వారా అమ్మాయిగా మారినప్పుడు ఎంతో బాధను అనుభవించానని తెలిపిన ప్రియాంక సింగ్.. ప్రస్తుతం గ్లామరస్ పాత్రలలో నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని.. ఈ సందర్భంగా తెలియజేసింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…