Priyanka Singh : బిగ్ బాస్ ప్రియాంక సింగ్‌ గురించి.. అతిపెద్ద సీక్రెట్స్ ఇవే!

October 20, 2021 10:59 PM

Priyanka Singh : బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమంలో ట్రాన్స్‌ జెండర్ గా అడుగుపెట్టిన ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ సాయి తేజ్ గా ఎంట్రీ ఇచ్చి అందరికీ పరిచయమైంది. అయితే జబర్దస్త్ కార్యక్రమంలో ఎక్కువగా లేడీ పాత్రలలో నటించిన సాయి తేజ్ ఆ తర్వాత సర్జరీ ద్వారా అమ్మాయిగా మారిపోయింది.

Priyanka Singh of bigg boss these are her secrets

ఇలా సర్జరీ ద్వారా సాయి తేజ్ నుంచి ప్రియాంక సింగ్ గా మారిన ఈమె స్టేజ్ పై అందరినీ నవ్వించినప్పటికే తన జీవితంలో ఎన్నో విషాద ఘటనలు ఉన్నాయని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. సమాజానికి తాను ఒక అబ్బాయిగా పరిచయం అయినప్పటికీ తనకు అమ్మాయిగా ఉండాలనే కోరిక ఉండేదని చిన్నప్పటి నుంచి తన అక్క దుస్తులు ధరించడం వల్ల తనకు అమ్మాయిగా మారాలనే ఆలోచన బలపడిందని తెలియజేసింది.

ఈ క్రమంలోనే ఈ కోరికను ఇప్పుడు తీర్చుకోకపోతే భవిష్యత్తులో తీర్చుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించిన ప్రియాంక సింగ్ తన స్నేహితుల సహాయంతో లక్షల రూపాయలు ఖర్చు చేసి అమ్మాయిగా మారింది.

అయితే తాను ఎక్కడ సర్జరీ చేయించుకుందీ, ఎంత ఖర్చయిందనే విషయాలను మాత్రం ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచుతున్నట్టు తెలియజేసింది. తాను సర్జరీ ద్వారా అమ్మాయిగా మారినప్పుడు ఎంతో బాధను అనుభవించానని తెలిపిన ప్రియాంక సింగ్.. ప్రస్తుతం గ్లామరస్ పాత్రలలో నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని.. ఈ సందర్భంగా తెలియజేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now