Priyanka Singh : మాన‌స్‌, ప్రియాంక మ‌ధ్య ఏం జ‌రుగుతోంది.. ల‌వ్ సీన్‌తో రెచ్చిపోయారుగా..!

April 22, 2022 6:50 PM

Priyanka Singh : బిగ్ బాస్ షోలో కొంద‌రు కంటెస్టెంట్స్ మ‌ధ్య ప్రేమ‌, దోమ పుట్ట‌డం స‌హ‌జం. కొంద‌రు హౌజ్‌లో ఉన్న‌న్ని రోజులు ప్రేమ అని చెప్పి బ‌య‌ట‌కు వ‌చ్చిన తర్వాత మాత్రం ఎవ‌రి దారులు వారు వెతుక్కుంటున్నారు. మ‌రి కొంద‌రు మాత్రం ప్రేమ‌ను కంటిన్యూ చేస్తూ పెళ్లి పీట‌లు ఎక్కుతున్నారు. అయితే బిగ్ బాస్ సీజ‌న్ 5 లో ఓ ఆస‌క్తిక‌ర ప్రేమాయ‌ణం సాగింది. ట్రాన్స్‌జెండ‌ర్ ప్రియాంక‌.. మాన‌స్‌ని తెగ ఇష్ట‌ప‌డింది. దేవుడు తనకు మంచి లైఫ్‌ ఇచ్చి ఉంటే బాగుండేదని, అప్పుడు మానస్‌తో హ్యాపీగా ఉండేదాన్ని అంటూ ఎమోషనల్‌ అయ్యింది. మానస్‌పై పింకీ మరింతగా ప్రేమని పెంచుకోగా, వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుంటార‌ని కూడా పుకార్లు పుట్టించారు.

Bigg Boss Priyanka Singh  with Manas video viral
Priyanka Singh

హౌజ్‌లో మాన‌స్‌కి కాస్త నెగెటివిటీ వ‌చ్చింది ప్రియాంక వ‌ల్ల‌నే అని చెప్పొచ్చు. హౌస్‌లో పలు సందర్బాల్లో ప్రియాంక త‌న ప్రేమ‌ను వ్యక్తపరిచినప్పటికీ మానస్ ఆమెను దూరం పెట్టేవాడు. అయితే తనకు ఏమి కావాలన్నా ప్రియాంకతోనే చేయించుకునేవాడు మానస్. ఇక బిగ్ బాస్ కూడా వీళ్ల మధ్య లవ్ ట్రాక్‌ నడిపించడానికి గట్టి ప్రయత్నాలే చేశాడు. మానస్ పేరు చెబితేనే మెలికలు తిరిగిపోతుండ‌డం.. అతను దూరం దూరం అంటున్నా.. ఆమె మాత్రం అతని పక్కనే తిష్ట వేస్తూ.. అతి ప్రేమ చూపించడం ఇలా చాలా చేసింది.

అయితే బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసిన సంద‌ర్భాలు లేవు. తాజాగా ప్రియాంక సింగ్ మానస్ తో ఒక లవ్ సీన్ తో రీల్ చేసింది. అబ్బాయిలు స్మార్ట్ గా ఉండడం కన్నా కూడా ఇన్నోసెంట్ గా ఉంటేనే బాగుంటుంది.. నాకు వాడి ఇన్నోసెన్స్ చాలా ఇష్టం.. అనే డైలాగ్ ను చెప్పిన ప్రియాంకను మానస్ చూసి సిగ్గుపడిపోయాడు. ప్రస్తుతం ఆ రీల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీనిపై నెటిజ‌న్స్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now