Priyanka Singh : సినిమా చాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్‌..!

January 25, 2022 8:18 AM

Priyanka Singh : బిగ్ బాస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్ల‌కు ఎంత‌టి పేరు వ‌స్తుందో అంద‌రికీ తెలిసిందే. కొంద‌రు ఆ పేరును నిల‌బెట్టుకుని వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటున్నారు. ఇక ఇటీవ‌లే ముగిసిన బిగ్ బాస్ సీజ‌న్ 5 ద్వారా ఎంతో పాపుల‌ర్ అయిన ప్రియాంక సింగ్‌ను కూడా సినిమా చాన్స్ వ‌రించింది. త్వ‌ర‌లో ఆమె ఓ మూవీలో సంద‌డి చేయ‌నుంది.

Priyanka Singh bigg boss fame got movie chance

బిగ్ బాస్ 5 లో ప్రియాంక సింగ్ త‌న ఆట తీరుతో అంద‌రినీ అల‌రించింది. అయితే ఆమె మాన‌స్ వెంట ప‌డ‌డం.. అది ఒక ద‌శ‌లో శృతి మించ‌డంతో కంటెస్టెంట్ల‌కు సైతం ఈమె అంటే విసుగు వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ పోటీలో చివ‌రి వ‌ర‌కు నిలిచి ఆశ్చ‌ర్య ప‌రిచింది. ఇక మాన‌స్ టాప్ 5 లో నిలిచాడు. కానీ ప్రియాంక సింగ్ మాత్రం రెండు వారాల ముందే ఎలిమినేట్ అయింది. అయిన‌ప్ప‌టికీ ఈ సీజ‌న్‌లో ఈమెకు వ‌చ్చిన పేరు అంతా ఇంతా కాదు.

అయితే తాజాగా ప్రియాంక సింగ్ ను సినిమా ఆఫ‌ర్ వ‌రించింది. ప్ర‌ముఖ నిర్మాత‌, ర‌చ‌యిత కోన వెంక‌ట్‌ను ప్రియాంక సింగ్ క‌లిసింది. త‌మ మీటింగ్ తాలూకు విష‌యాల‌ను ప్రియాంక సింగ్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది.

ప్ర‌స్తుతం క‌థా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయ‌ని, త్వ‌ర‌లోనే ఓ ఎగ్జ‌యిట్‌మెంట్‌తో రాబోతున్నా.. అంటూ ఆమె ట్వీట్ చేసింది. అయితే ఈమె న‌టిస్తున్న సినిమా ఏమిటి ? క‌థ ఏంటి ? వంటి వివ‌రాల‌న్నింటినీ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్‌లో న‌టిస్తున్న కొంద‌రు మాత్రం సినిమాల్లోనూ త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. మ‌రి ప్రియాంక సింగ్ స‌క్సెస్ అవుతుందా.. లేదా.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now