గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Priyanka Singh : బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్ పెళ్లి..? వీడియో వైర‌ల్‌..!

Priyanka Singh : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. బిగ్ బాస్ షోతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ ప్రియాంక సింగ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ప్రియాంక…

Priyanka Singh : బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్ పెళ్లి..? వీడియో వైర‌ల్‌..!

Priyanka Singh : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. బిగ్ బాస్ షోతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ ప్రియాంక సింగ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ప్రియాంక సింగ్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడం అందరికీ బిగ్ షాకింగ్ గా మారింది. తన కుటుంబానికి ఆధారంగా ఉండటంకోసం సాయి తేజ అనే అబ్బాయి ప్రియాంక సింగ్ అనే అమ్మాయిగా మారిపోయింది. జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన‌ ప్రియాంక బిగ్ బాస్ షో ద్వారా ఎంత మంచి పేరు సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ప్రియాంక సింగ్ బిగ్ బాస్ షోలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, తోటి కంటెస్టెంట్ మానస్ తో నడుచుకున్న విధానం, అందరితో స్నేహంగా ఉండే విధానం చాలామంది ప్రేక్షకులకు నచ్చింది. బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చిన తరువాత పలు ఈవెంట్స్, ఫోటోషూట్స్ తో ఫుల్ బిజీగా మారింది ప్రియాంక సింగ్. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తన గ్లామర్ సీక్రెట్స్ ను తన అభిమానులతో పంచుకుంటోంది.

Priyanka Singh reportedly marrying soon viral video
Priyanka Singh

ఇటీవల ప్రియాంక సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో అందంగా పసుపు చీరలో రెడీ అయిన హ‌ల్దీ వేడుకకు సంబంధించిన  వీడియోలను, ఫోటోలను షేర్ చేసింది. దీంతో ప్రియాంక సింగ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి ఇది ఫోటోషూట్ కోసమా.. లేక పెళ్లి కోసమా.. తెలియాలంటే ప్రియాంక సింగ్ నోరు విప్పి చెప్పాల్సిందే.

మరి వేరే వివాహ వేడుకలో ప్రియాంక చేసే హంగామానో తెలియదు కానీ, ఇప్పటివరకు ప్రియాంక సింగ్ తాను పెళ్లి  చేసుకోబోతున్నట్లు అధికారిక ప్రకటన ఇవ్వలేదు. మరి ఈ హంగామా అంతా తన యూట్యూబ్ ఛానెల్ కోసమో ఏమో వేచి చూడాలి. పసుపు రంగు చీరలో ప్రియాంక చేసిన పోస్ట్ మాత్రం అందరినీ ఆకర్షిస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి