Pawan Kalyan : సినీ ఇండ‌స్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ చుక్క‌లు చూపిస్తున్నారా..?

November 17, 2021 11:18 PM

Pawan Kalyan : సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన రిప‌బ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ ప్ర‌భుత్వం, ఆ రాష్ట్ర మంత్రుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన విష‌యం విదిత‌మే. అయితే ఆ విష‌యం చిలికి చిలికి గాలివాన అయింది. ఒక ద‌శ‌లో అది ప‌వ‌న్ వ‌ర్సెస్ ఏపీ ప్ర‌భుత్వం నుంచి ప‌వ‌న్ వ‌ర్సెస్ పోసానిగా మారింది.

tollywood industry fearing about Pawan Kalyan

ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ అభిమానులు కాస్త ముందుకు వెళ్లి పోసాని ఇంటిపై దాడులు చేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి. త‌రువాత పోసాని మ‌ళ్లీ క‌నిపించ‌లేదు. ఆ వివాదం అంత‌టితో స‌ద్దు మ‌ణిగింది. అయితే అదే స‌మ‌యంలో ఇండ‌స్ట్రీ మొత్తం త‌మ‌కు ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో సంబంధం లేద‌ని బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేసింది. నిర్మాత‌లు, న‌టులు కూడా ఏపీ సీఎం జ‌గ‌న్‌, మంత్రుల‌ను క‌లిశారు. త‌మ క‌ష్టాల‌ను చెప్పుకున్నారు. అయితే వారి ఇబ్బందుల‌పై ఏపీ ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. టిక్కెట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌లేదు. దీంతో ఏపీలో విడుద‌ల అయ్యే సినిమాల‌పై టిక్కెట్ల రేట్ల ప్ర‌భావం ప‌డుతుంద‌ని, నిర్మాత‌లు, బ‌య్య‌ర్లు న‌ష్ట‌పోతార‌ని చ‌ర్చించుకుంటున్నారు.

ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ సుదీర్ఘ కాలం సినిమాల‌కు బ్రేక్ ఇచ్చాక విడుద‌లైన సినిమా.. వ‌కీల్ సాబ్‌. ఈ మూవీ విడుద‌ల స‌మ‌యంలోనూ ప‌వ‌న్‌కు ఇబ్బందులు వ‌చ్చాయి. ఏపీలో థియేట‌ర్ల‌లో షోల విష‌యంలో, టిక్కెట్ల ధ‌ర‌ల విష‌యంలో ప‌వ‌న్‌ను ఇరుకున పెట్టార‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే అప్ప‌టికి ఆ వివాదం స‌ద్దు మ‌ణిగినా.. ప‌వ‌న్ మాత్రం దాన్ని మ‌న‌స్సులోనే పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీకి ప‌వ‌న్ భీమ్లా నాయ‌క్ అడ్డుగా ఉంద‌ని అనుకుంటున్నారు.

సంక్రాంతి బ‌రిలో మూడు పెద్ద మూవీలు ఉన్నాయ‌ని తెలిసి కూడా రాజ‌మౌళి త‌న ఆర్ఆర్ఆర్ మూవీని రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో మ‌హేష్ త‌న స‌ర్కారు వారి పాట‌ను వేస‌వి రిలీజ్‌కు మార్చారు. రేపో మాపో ప్ర‌భాస్ రాధేశ్యామ్ కూడా ఫిబ్ర‌వ‌రికి వాయిదా ప‌డుతుంద‌ని అనుకుంటున్నారు. ఇక మిగిలింది ప‌వ‌న్ భీమ్లా నాయ‌క్ ఒక్కటే.

ఆర్ఆర్ఆర్ మూవీ జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానుండ‌గా, భీమ్లా నాయ‌క్‌ను జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించేశారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీని భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. ఈ మూవీ విడుద‌ల స‌మ‌యంలో ఇత‌ర పెద్ద మూవీలు ఉంటే ఆర్ఆర్ఆర్ కు వ‌చ్చే క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం ప‌డుతుంది. అందువ‌ల్ల మ‌హేష్ పెద్ద మ‌న‌స్సు చేసుకుని త‌న మూవీ విడుద‌ల‌ను మార్పు చేశార‌ని అంటున్నారు. అయితే ప్ర‌భాస్ కూడా రాధేశ్యామ్‌ను ఫిబ్ర‌వ‌రికి వాయిదా వేసే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని, కానీ ప‌వ‌న్ మాత్రం త‌న మూవీ విడుద‌ల మార్పుపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని తెలుస్తోంది.

త‌న వ‌కీల్ సాబ్ మూవీ రిలీజ్ స‌మ‌యంలోనూ.. ఇటీవ‌ల రిప‌బ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌ల స‌మ‌యంలో తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై జ‌రిగిన ప‌రిణామాల‌పై.. త‌న‌ను ప‌ట్టించుకోని ఇండ‌స్ట్రీకి తాను ఇప్పుడు ఎందుకు ఫేవ‌ర్ చేయాల‌ని, ఎవ‌రికి ఏం జ‌రిగితే నాకేంటి ? నా సినిమాల‌కు, నా వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ద‌తుగా నిలిచారా ? ఇప్పుడు నేను ఎందుకు మ‌ద్ద‌తు ఇవ్వాలి ? అన్న‌ట్లుగా ప‌వ‌న్ ఆలోచిస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ విష‌యంపై ప‌వ‌న్ అభిమానులు కూడా ఆయ‌న‌కు ఫుల్ స‌పోర్ట్ ఇస్తున్నారు. ప‌వ‌న్ ఒకే వ్య‌క్తిత్వం ఉన్న‌వాడ‌ని, ఆయ‌న ఎవ‌రి కోస‌మూ మార‌డ‌ని.. అంటున్నారు. ఇండ‌స్ట్రీ త‌న వైపు నిల‌బ‌డ‌న‌ప్పుడు త‌న‌తో ఏం ప‌ని ? అని అంటున్నారు. మ‌రి ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ స‌మ‌స్య నుంచి ఎలా బ‌య‌ట ప‌డుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now