Tirumala : ఈ నెల 20 నుంచి ఆన్ లైన్ లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు..!

March 18, 2022 12:58 PM

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు శుభవార్తను తెలియచేశారు. ఏప్రిల్, మే,జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఈ నెల 20న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ టికెట్లను www.tirupatibalaji.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌ ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానంలో కేటాయించనున్నారు.

Tirumala  arjita seva tickets from 20th March through online
Tirumala

ఇక ఈ మూడు నెలలకు సంబంధించిన స్వామివారి ఆర్జిత సేవా టిక్కెట్లను ఈనెల 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 22వ తేదీన ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. ఇక టికెట్స్ బుక్ చేసుకున్న వారి వివరాలకు సంబంధించి 22వ తేదీన ఉదయం 10 గంటల తర్వాత సంబంధిత వెబ్ సైట్ లో వివరాలను పొందుపరచనున్నారు.

ఇక ప్రత్యేక దినాలు దినాలు, పర్వదినాలలో స్వామివారి ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారు. ఏప్రిల్ 2వ తేదీ ఉగాది పండుగ, ఏప్రిల్ 10వ తేదీ శ్రీరామనవమి, ఏప్రిల్‌ 14 నుండి 16వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను, సహస్రదీపాలంకార సేవలను, ఏప్రిల్‌ 15న నిజ పాద దర్శనం సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇక స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ తో పాటు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment