OTT : ఓటీటీల్లో ఈ రోజు నుంచి స్ట్రీమ్ కానున్న ఎక్సైటింగ్ మూవీస్‌, షోస్ ఇవే..!

February 4, 2022 11:05 AM

క‌OTT : రోనా ఏమోగానీ ఓటీటీల రూపంలో ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదం ల‌భిస్తోంది. క‌రోనా పుణ్య‌మా అని చెప్పి ఓటీటీ సంస్థ‌లు పండుగ చేసుకుంటున్నాయి. ప్రేక్ష‌కులు న‌చ్చే, మెచ్చే సిరీస్‌లు, షోస్‌ను ప్ర‌సారం చేస్తున్నాయి. మ‌రోవైపు థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్న సినిమాల‌ను ప్రేక్షకుల ముందుకు అతి త‌క్కువ కాలంలోనే తీసుకువ‌స్తున్నాయి. దీంతో ప్రేక్ష‌కులు స‌హ‌జంగానే ఓటీటీల వైపు మొగ్గు చూపిస్తున్నారు.

these movies, shows and series will stream from today in OTT apps
OTT

ఇక శుక్ర‌వారం ప్రీమియ‌ర్ డే. క‌నుక ఈ రోజు నుంచి ఓటీటీల్లో కొన్ని సినిమాలు, సిరీస్‌, షోస్ స్ట్రీమ్ కానున్నాయి. ముఖ్యంగా అన్‌స్టాప‌బుల్ షో చివ‌రి ఎపిసోడ్ ప్ర‌సారం కానుంది. ఈ ఎపిసోడ్‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గెస్ట్‌గా పాల్గొన్నారు. బాల‌కృష్ణ‌.. మ‌హేష్‌ను అనేక స‌ర‌దా ప్ర‌శ్న‌లు అడిగార‌ని.. ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మైంది. ఇక ఎపిసోడ్ ఎలా ఉంటుందోన‌ని ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ ఆహాలో రాత్రి 8 గంట‌ల‌కు స్ట్రీమ్ కానుంది.

తాప్సీ న‌టించిన కామెడీ హిందీ మూవీ లూప్ ల‌పేటా కూడా ఈ రోజు నుంచే నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. అలాగే సోనీ లివ్ ఓటీటీలో రాకెట్ బాయ్స్ అనే అద్భుత‌మైన సిరీస్ ప్ర‌సారం కానుంది. భార‌త్‌కు చెందిన ఇద్ద‌రు రాకెట్ సైంటిస్టుల జీవితం ఆధారంగా దీన్ని తెర‌కెక్కించారు.

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో ది గ్రేట్ ఇండియ‌న్ మ‌ర్డ‌ర్ పేరిట ఓ క్రైమ్ డ్రామా థ్రిల్ల‌ర్ సిరీస్ ప్ర‌సారం కానుంది. దాదాపు అన్ని ప్ర‌ధాన భార‌తీయ భాష‌ల్లోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం ఓటీటీల ద్వారా ప్రేక్ష‌కుల‌కు చ‌క్క‌ని వినోదం ల‌భ్యం కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment