టీవీ షోల్లో తిరుగులేని షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇలాంటి షోలు మొదట విదేశాల్లో ఉండేవి. అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో ఇండియాలో ప్రారంభించారు. మొదట నార్త్ లో ఈ షోని ప్రారంభించారు. అక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించడంతో అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ బిగ్ బాస్ ని ప్రారంభించారు.
ఇప్పటి వరకు బిగ్ బాస్ 5 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6పై దృష్టి పెట్టారు నిర్వాహకులు. ఈ సీజన్‌కు కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. బిగ్ బాస్ సీజన్ 6 వచ్చే నెల నుంచి మొదలు కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల సెలక్షన్ కంప్లీట్ అయిందని తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యాంకర్ మంజుషా బిగ్ బాస్ షోలో కనిపించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అలాగే తెలుగులో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆశా షైనీ కూడా బిగ్ బాస్ 6 కంటెస్టెంట్లలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా హీరోయిన్ ప్రీతి అస్రాని కూడా బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ల లిస్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక కెరీర్ విషయంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న హీరోల్లో సుమంత్ అశ్విన్ ఒకరు. సుమంత్ అశ్విన్ కూడా బిగ్ బాస్ 6 లో సందడి చేసే అవకాశం ఉందట.
అలాగే సీరియల్ యాక్టర్ కౌశిక్, మాస్టర్ భరత్ పేర్లు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన కృషిత, ప్రముఖ ఆర్టిస్ట్ సంజనా చౌదరి, న్యూస్ యాంకర్ పద్మిని, ట్రాన్స్ జెండర్ తన్మయి కూడా ఉన్నారని తెలుస్తోంది. ప్రేక్షకులకు పరిచయం ఉన్న కంటెస్టెంట్లతోపాటు సామాన్యులకు కూడా బిగ్ బాస్ షోలో అవకాశం ఇవ్వనున్నారట. ఈసారి బిగ్ బాస్ షో ఇంతకు ముందుకంటే రికార్డు స్థాయిలో రేటింగ్ ను సొంతం చేసుకుంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…