బిగ్ బాస్ 6 కంటెస్టెంట్లు వీరేనా ? వైర‌ల్ అవుతున్న లిస్ట్‌..!

August 7, 2022 2:22 PM

టీవీ షోల్లో తిరుగులేని షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇలాంటి షోలు మొదట విదేశాల్లో ఉండేవి. అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో ఇండియాలో ప్రారంభించారు. మొదట నార్త్ లో ఈ షోని ప్రారంభించారు. అక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించడంతో అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ బిగ్ బాస్ ని ప్రారంభించారు.

ఇప్పటి వరకు బిగ్ బాస్ 5 సీజన్ల‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6పై దృష్టి పెట్టారు నిర్వాహకులు. ఈ సీజ‌న్‌కు కూడా నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. బిగ్ బాస్ సీజన్ 6 వచ్చే నెల నుంచి మొదలు కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల సెలక్షన్ కంప్లీట్ అయిందని తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

these may be the bigg boss 6 telugu contestants list viral

యాంకర్ మంజుషా బిగ్ బాస్ షోలో కనిపించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అలాగే తెలుగులో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆశా షైనీ కూడా బిగ్ బాస్ 6 కంటెస్టెంట్లలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా హీరోయిన్ ప్రీతి అస్రాని కూడా బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ల లిస్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక కెరీర్ విషయంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న హీరోల్లో సుమంత్ అశ్విన్ ఒకరు. సుమంత్‌ అశ్విన్ కూడా బిగ్ బాస్ 6 లో సందడి చేసే అవకాశం ఉందట.

అలాగే సీరియల్ యాక్టర్ కౌశిక్, మాస్టర్ భరత్ పేర్లు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన కృషిత, ప్రముఖ ఆర్టిస్ట్ సంజనా చౌదరి, న్యూస్ యాంకర్ పద్మిని, ట్రాన్స్ జెండర్ తన్మయి కూడా ఉన్నారని తెలుస్తోంది. ప్రేక్షకులకు పరిచయం ఉన్న కంటెస్టెంట్లతోపాటు సామాన్యులకు కూడా బిగ్ బాస్ షోలో అవకాశం ఇవ్వనున్నారట. ఈసారి బిగ్ బాస్ షో ఇంతకు ముందుకంటే రికార్డు స్థాయిలో రేటింగ్ ను సొంతం చేసుకుంటుంద‌ని అభిమానులు అంచనా వేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment