Athadu Movie : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇందులో మహేష్ బాబు కామెడీ టైమింగ్ అదిరిపోయింది. త్రిష, మహేష్ మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఇందులో బ్రహ్మానందం కామెడీ మూవీకే హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలో కొన్ని సీన్లు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. రామ్ మోహన్, కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
అయితే ఈ సినిమాలో ముందుగా ఉదయ్ కిరణ్ ను హీరోగా అనుకున్నారు. కానీ అప్పుడు ఉదయ్ కిరణ్ డేట్స్ అల్లు అరవింద్ చేతిలో ఉండగా ఆయన సినిమాను రిజెక్ట్ చేశారు. ఆ తరవాత మహేశ్ బాబు వద్దకు ఈ కథ వెళ్లగా మహేశ్ బాబుకు కథ నచ్చడంతో వెంటనే ఓకే చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలోని సీన్లు, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. కానీ ఎడిటింగ్ లో కొన్ని సీన్లను కట్ చేశారు. అవేంటంటే..
మహేశ్ బాబు త్రిషకు హగ్ ఇచ్చే ఓ సీన్ ఉంటుంది. ఆ సీన్ ను సినిమా నుండి కట్ చేశారు. సినిమాలో త్రిషపై పెయింట్ పడే ఓ సీన్ ఉంటుంది. కానీ సినిమాలో సీన్ మనకు ఎక్కడా కనిపించలేదు. మరో సీన్ లో మహేశ్ బాబు పక్కన త్రిష భరతనాట్యం చేసే గెటప్ లో కనిపిస్తుంది. కానీ ఆ సీన్ సినిమాలో కనిపించదు. ఓ సందర్భంలో త్రిష, మహేశ్ బాబు ఇద్దరూ వైన్ తాగుతూ కనిపించారు. కానీ సినిమాలో మాత్రం ఈ సీన్ ను లేపేశారు. ఈ విధంగా కొన్ని మంచి సీన్లను మూవీలోంచి కట్ చేసినప్పటికీ టెలివిజన్ లో అతడు మూవీ వస్తుంది అంటే.. రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…