Athadu Movie : అత‌డు మూవీలో తొల‌గించిన‌ కొన్ని ముఖ్యమైన సీన్లు.. అవి ఉంటే మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉండేదేమో..?

August 24, 2022 12:44 PM

Athadu Movie : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇందులో మహేష్ బాబు కామెడీ టైమింగ్ అదిరిపోయింది. త్రిష, మహేష్ మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఇందులో బ్రహ్మానందం కామెడీ మూవీకే హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలో కొన్ని సీన్లు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్ట‌వు. రామ్ మోహ‌న్, కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

అయితే ఈ సినిమాలో ముందుగా ఉద‌య్ కిర‌ణ్ ను హీరోగా అనుకున్నారు. కానీ అప్పుడు ఉద‌య్ కిర‌ణ్ డేట్స్ అల్లు అర‌వింద్ చేతిలో ఉండ‌గా ఆయ‌న సినిమాను రిజెక్ట్ చేశారు. ఆ త‌ర‌వాత మ‌హేశ్ బాబు వ‌ద్ద‌కు ఈ క‌థ వెళ్లగా మ‌హేశ్ బాబుకు కథ నచ్చడంతో వెంటనే ఓకే చేశారు. ఇదిలా ఉండ‌గా ఈ సినిమాలోని సీన్లు, కామెడీ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు తెగ‌ న‌చ్చేశాయి. కానీ ఎడిటింగ్ లో కొన్ని సీన్లను కట్ చేశారు. అవేంటంటే..

these are the removed scenes from Athadu Movie
Athadu Movie

మ‌హేశ్ బాబు త్రిష‌కు హ‌గ్ ఇచ్చే ఓ సీన్ ఉంటుంది. ఆ సీన్ ను సినిమా నుండి కట్ చేశారు. సినిమాలో త్రిషపై పెయింట్ ప‌డే ఓ సీన్ ఉంటుంది. కానీ సినిమాలో సీన్ మ‌న‌కు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. మరో సీన్ లో మ‌హేశ్ బాబు ప‌క్క‌న త్రిష భ‌ర‌త‌నాట్యం చేసే గెట‌ప్ లో క‌నిపిస్తుంది. కానీ ఆ సీన్ సినిమాలో కనిపించదు. ఓ సందర్భంలో త్రిష, మ‌హేశ్ బాబు ఇద్ద‌రూ వైన్ తాగుతూ క‌నిపించారు. కానీ సినిమాలో మాత్రం ఈ సీన్ ను లేపేశారు. ఈ విధంగా కొన్ని మంచి సీన్లను మూవీలోంచి కట్ చేసినప్పటికీ టెలివిజన్ లో అతడు మూవీ వస్తుంది అంటే.. రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now