Jani Master : రాజకీయాలు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ వారసత్వానికి పెట్టింది పేరు అన్నట్టు ఉంటున్నాయి. ముఖ్యంగా సినిమాల్లో అయితే ఇక్కడ టాలెంట్ కంటే.. మన వాడు అయితే చాలు అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. కుటుంబం పేరు చెప్పుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తారు. దానికి తగ్గట్టే తాతల పేర్లు, తండ్రుల పేర్లు చెప్పుకుని కొందరు.. అమ్మ, పిన్నమ్మ పేర్లు చెప్పుకొని మరికొందరు.. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇండస్ట్రీపై పడి బ్రతికేస్తున్నారు. వీళ్లల్లో కొందరికి హీరో అయ్యే లక్షణాలు కూడా లేవు అని అందరికీ తెలిసిందే.
అయితే సినీ ఇండస్ట్రీ చాలా విశాలమైనది. ఉన్న హీరోలు చాలదన్నట్లు.. కొత్త హీరోలకు కూడా అవకాశం ఇస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఉన్న హీరోలే కొత్త కథలు దొరకక తీసిన కథలనే మళ్ళీ తీస్తూ అట్టర్ ఫ్లాప్ సినిమాలను ఖాతాలో వేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఒక కొరియోగ్రాఫర్ హీరోగా ఎంట్రీ ఇస్తే జనాలు నవ్వుకోరూ..? ప్రస్తుతం అదే జరుగుతోంది.
సినీ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇండియన్ టాప్ కొరియోగ్రాఫర్‌గా దూసుకుపోతోన్నాడు జానీ మాస్టర్. కోలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలలోనూ జానీ మాస్టర్ తన సత్తాను చాటుతున్నాడు. ఇక తెలుగులో అయితే జానీ మాస్టర్ స్టెప్పులు కంపోజ్ చేస్తే అవి ట్రెండ్ అవుతాయి. ఈ మధ్యే బీస్ట్ సినిమాలో విజయ్, పూజా హెగ్డేలతో అదిరిపోయే స్టెప్పులు వేయించాడు. అరబిక్ కుత్తు, హళమితి హబీబీ అంటూ అందరినీ ఊపు ఊపేశాడు జానీ మాస్టర్. అయితే శుభ్రంగా వచ్చిన పని చేసుకోక హీరోగా ఎంట్రీ ఇచ్చి జానీ మాస్టర్ తప్పు చేశారు అంటున్నారు కొందరు నెటిజన్లు.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా యథా రాజా తథా ప్రజా సినిమా ఆరంభమైంది. శ్రీనివాస్ విట్టల దర్శకత్వం వహిస్తున్నారు. హీరో శర్వానంద్ క్లాప్ కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శుభ్రంగా వచ్చిన పని చేసుకోకుండా ఇలా హీరోగా ఎంట్రీ ఇవ్వడంపై జానీ మాస్టర్ ను కొందరు ట్రోల్ చేస్తున్నారు . ఉన్న హీరోలే ఏం పిసుక్కోలేకపోతుంటే.. మీరేం పీకుదామని ఇండస్ట్రీకి వచ్చారు సార్.. అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. చూడాలి మరి.. జానీ మాస్టర్ హీరోగా రాణిస్తారో లేదో..!
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…