సినిమా నేప‌థ్యం ఉన్నా.. హీరోయిన్స్ గా రాణించ‌లేక‌పోతున్న‌ సెల‌బ్రిటీ డాట‌ర్స్‌.. కార‌ణం అదేనా..?

సినిమా ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికే ఎంతో మంది అడుగు పెట్టి తమ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. చాలా మంది ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే వ‌చ్చి స్వ‌యం కృషితో ఎదిగారు. ఇక కొంద‌రు త‌మ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో వ‌చ్చి స్టార్లుగా మారారు. అయితే కొంద‌రు మాత్రం డ‌బ్బు, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌ప్ప‌టికీ స్టార్లుగా ఎద‌గ‌లేక‌పోయారు. అయితే చాలా వ‌ర‌కు హీరోలు మాత్రం స్టార్స్ అయ్యారు. కానీ సినిమా నేప‌థ్యం ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ హీరోలు, ఇత‌ర న‌టుల‌కు చెందిన కుమార్తెలు మాత్రం హీరోయిన్స్ కాలేక‌పోయారు. వారెవ‌రంటే..

అక్కినేని నాగేశ్వరావు మనవ‌రాలు, నాగార్జున మేనకోడలైన సుప్రియ యార్లగడ్డ మొదటి సినిమాను పవన్ కళ్యాణ్ తో కలిసి చేసింది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీలో హీరోయిన్ గా న‌టించి ఇండస్ట్రీకి పరిచయం అయింది. అయితే ఈ సినిమా తర్వాత ఈమెకి అనుకున్న స్థాయిలో హీరోయిన్ గా ఛాన్స్ లు రాలేదు. ఇప్పుడు మంచి సినిమాల్లో అదిరిపోయే పాత్రలలో నటిస్తోంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ రెండో కూతురు, మహేష్ బాబు చిన్నక్క మంజుల కూడా హీరోయిన్‌గా అడుగుపెట్టాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. అప్పట్లో బాలకృష్ణతో ఒక సినిమా ఓకే కూడా అయింది. కానీ కృష్ణ అమ్మాయి కాబట్టి ఆమెని వేరే వాళ్ళ పక్కన ఊహించుకోలేమంటూ ప్రేక్షకుల నుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో ఆమె ఆశలు అడియాశ‌లయ్యాయి. కానీ మంజుల కొన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేసింది.

యూనివర్సల్ హీరో అయిన కమల్ హాసన్ కు ఇద్దరు ముద్దుల కూతుర్లు ఉన్నారు. ఇందులో ఇప్పటికే హీరోయిన్‌గా సత్తా చాటుతున్న శృతి హాసన్ కెరియర్ మొదట్లో ఎన్నో ప్లాప్ లను చూసింది. ఇక కమల్ 2వ కూతురు అక్షర‌ హాసన్ కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా ఉపయోగం లేదు. ఈమె హీరోయిన్‌గా కొన‌సాగ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంటోంది. అలాగే మెగా‌ ప్యామిలీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారికను మాత్రం ప్రేక్షకులు హీరోయిన్ గా ఆదరించలేదు. నిహారిక ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా కూడా ఆమెని హీరోయిన్ గా అంగీకరించలేక పోయారు.

అలాగే మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి పూర్తి స్థాయిలో హీరోయిన్‌గా నటించక పోయినా నటిగా మాత్రం మంచి సత్తా చాటుతోంది. ఎందుకో పూర్తి స్థాయిలో నటిగా ఎక్కువ సినిమాలు చేయలేకపోతోంది. తమిళ స్టార్ నటుడు శరత్ కుమార్ ముద్దుల తనయ వరలక్ష్మి కూడా హీరోయిన్‌గా సత్తా చాటాలని చూసినా కొన్ని సినిమాల‌ తర్వాత ఎందుకో హీరోయిన్ గా రాణించలేకపోయింది. ఇక ఇప్పుడు పూర్తి స్థాయిలో విలన్ గా, మంచి మంచి పవర్‌పుల్ రోల్స్ ప్లే చేస్తోంది. క్రాక్ లో కూడా రవితేజని ఢీకొట్టింది. ఒకప్పుడు హీరోగా నటించిన విజయ్ కుమార్ కు ముగ్గురు కూతుళ్లు వనిత, ప్రీతి, శ్రీదేవిలు ఉన్న విష‌యం విదిత‌మే. అయితే వీరు హీరోయిన్స్‌గా తమ అదృష్టాన్ని పరీక్షించు కున్నారు. కానీ తక్కువ సినిమాలే చేశారు.

ఇక యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య‌ కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈమె విశాల్ హీరోగా చేసిన‌ ధీరుడు అనే సినిమాతో పరిశ్రమలోకి అరంగేంట్రం చేసింది. ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో ఆ తర్వాత అనుకున్న స్థాయిలో ఈమెకి ఛాన్సులు రాలేదు. అలాగే హీరో రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మికలను కూడా ప్రేక్షకులు హీరో రాజశేఖర్, జీవిత కూతుర్లుగానే చూస్తూ వీళ్ళని ఆదరించలేకపోతున్నారు. అయినా వాళ్ళ ప్రయత్నాలు కొనసాగిస్తూ సినిమాలు చేస్తున్నారు. అయితే న‌టుల‌కు చెందిన కొడుకులు మాత్రం హీరోలుగా రాణిస్తున్నారు. కానీ కుమార్తెలు మాత్రం హీరోయిన్స్ కాలేక‌పోతున్నారు. అందుకు కార‌ణం ఆయా న‌టుల‌కు ఉండే అభిమానులే అని చెప్ప‌వ‌చ్చు. న‌టుల‌కు చెందిన కొడుకులు అయితే ఓకే. వాళ్ల‌ని ఆద‌రిస్తారు. కానీ కుమార్తెల‌ను మాత్రం హీరోయిన్స్‌గా చూడ‌డం లేదు. అందుక‌నే వారు హీరోయిన్స్ కాలేక‌పోతున్నారు. మ‌రి ఈ ట్రెండ్ ఇక ముందైనా మారుతుందో లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM