Jr NTR : ఇప్పుడు మాస్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ వేరు. వరుస హిట్స్ తో విభిన్న పాత్రలతో డబుల్, త్రిబుల్ రోల్స్ లో సైతం తారక్ ఆకట్టుకుంటున్నాడు. తాత పోలికలున్నాయంటూ ఈయనకి అప్పటికే మంచి గుర్తింపు రావడంతో నందమూరి అభిమానులకు అభిమాన పాత్రుడయ్యాడు. ఒక్కో సినిమాకు కనీసం రూ.40 కోట్లకు పైగానే అందుకుంటున్నాడు. ప్రస్తుతం కొరటాల మూవీతోపాటు ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మిగతా హీరోలతో పోలిస్తే, కేవలం 17 ఏళ్ల వయసులోనే హీరో అయిపోయాడు. అంతకుముందే గుణశేఖర్ తెరకెక్కించిన బాల రామాయణం సినిమాతో బాలా నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రానికి అవార్డులతో పాటు ప్రశంసలు వచ్చాయి.
దాంతో మూడేళ్లు గ్యాప్ తీసుకుని 2001లో నిన్ను చూడాలని సినిమాతో సోలో హీరోగా తారక్ ఎంట్రీ ఇచ్చాడు. ఓటు హక్కు కూడా రాని వయసులో మూతిమీద మీసాలు కూడా లేని టైమ్‌లోనే ఇండస్ట్రీ రికార్డులతో ఆడుకున్నాడు. నందమూరి వంశం నుంచి వచ్చి బాలయ్య తర్వాత స్టార్ హీరోగా తారక్ నిలబడ్డాడు. ఇప్పుడు బాబాయ్ కంటే చాలా పైనే ఉన్నాడని చెప్పాలి. స్టూడెంట్ నెం 1, ఆది సినిమాలతో తానేంటో నిరూపించుకుని, ఇక సింహాద్రి సినిమాతో స్టార్ హీరో అయ్యాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. జూనియర్ కెరీర్ ఆరంభంలోని కొన్ని విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా తొలి సినిమా పారితోషికం గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తారక్ హీరోగా విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా నిన్ను చూడాలని డిజాస్టర్ అయినప్పటికీ గుర్తింపు బాగానే వచ్చింది. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్‌కు నిర్మాత రామోజీ రావు రూ.4 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చారట. నిజానికి అప్పటికి ఆ ఎమౌంట్ తక్కువేమీ కాదు. అయితే ఓటు హక్కు కూడా రాని ఎన్టీఆర్ కు ఆ రూ.4 లక్షలతో ఏం చేయాలో అర్థం కాలేదట. వెంటనే ఆ సొమ్ము తీసుకెళ్లి తల్లి శాలినికి తారక్ గిఫ్ట్ గా ఇచ్చేశాడట. అయితే ఇప్పుడు మాత్రం కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు తారక్.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…