Liver : మీ శ‌రీరంలో ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ లివ‌ర్ డేంజ‌ర్‌లో ఉన్న‌ట్లే..!

Liver : మ‌న శ‌రీరంలో ఉండే అనేక అవ‌య‌వాల్లో లివ‌ర్ కూడా ఒక‌టి. ఇది అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాలు, శ‌క్తిని గ్ర‌హించి శ‌రీరానికి అందిస్తుంది. ర‌క్తంలో ఉండే విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. అలాగే కొవ్వుల‌ను జీర్ణం చేయ‌డంలో స‌హాయ ప‌డుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉండేలా చేస్తుంది. ఇలా కాలేయం అనేక ర‌కాల ప‌నులు చేస్తుంది. అయితే కొన్ని ర‌కాల కార‌ణాల వ‌ల్ల లివ‌ర్ ప‌నితీరు మందగిస్తుంది. దీంతో క్ర‌మేణా లివ‌ర్ చెడిపోతుంది. అయితే లివ‌ర్ ప‌నితీరు మంద‌గించిన‌ప్పుడే మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. దీంతో లివ‌ర్ ఆరోగ్యం బాగాలేద‌ని అర్థం చేసుకోవాలి. ఆ స‌మ‌యంలో డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ఒక‌వేళ లివ‌ర్ స‌మ‌స్య ఉన్న‌ట్లు తేలితే ముందుగానే చికిత్స తీసుకోవచ్చు. దీంతో లివ‌ర్ చెడిపోకుండా కాపాడుకున్న‌వార‌మ‌వుతాము. ఇక లివ‌ర్ ప‌నితీరు బాగాలేన‌ప్పుడు ఎలాంటి లక్ష‌ణాలు క‌నిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లివ‌ర్ ఆరోగ్యం స‌రిగ్గా లేన‌ప్పుడు మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అవేమిటంటే.. గ్యాస్, క‌ళ్ల కింద న‌ల్ల‌ని వ‌ల‌యాలు, కోపం, విసుగు, పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోవ‌డం, మొటిమ‌లు, దుర‌ద‌లు, ద‌ద్దుర్లు, మ‌హిళ‌ల‌కు అయితే రుతుక్ర‌మం స‌రిగ్గా లేక‌పోవ‌డం, నిద్ర‌లేమి, రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌డం, ఫుడ్ అల‌ర్జీలు, భోజ‌నం చేశాక వికారంగా ఉండ‌డం.. ఇవ‌న్నీ లివ‌ర్ ప‌నితీరు మంద‌గించింద‌ని తెలియ‌జేసే ల‌క్ష‌ణాలు. క‌నుక ఇవి ఎవరిలో అయినా ఉంటే ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వెంట‌నే ప‌రీక్ష‌లు చేయించుకుని చికిత్స తీసుకోవ‌డం ఉత్త‌మం. దీంతో లివ‌ర్ పూర్తిగా చెడిపోకుండా ముందుగానే అడ్డుకోవ‌చ్చు.

Liver

ఇక లివ‌ర్ ప‌నితీరు మంద‌గించేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. మెడిసిన్లను అధికంగా వాడ‌డం, మ‌ద్యం ఎక్కువగా సేవించ‌డం, అధిక బ‌రువు వంటి కార‌ణాల వ‌ల్ల లివ‌ర్ అనారోగ్యం బారిన ప‌డుతుంది. అయితే వీటి నుంచి బ‌య‌ట ప‌డే ప్ర‌య‌త్నం చేయాలి. దీని వ‌ల్ల కూడా లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. ఇలా లివ‌ర్‌ను ర‌క్షించుకుంటే భ‌విష్య‌త్తులో ఎలాంటి తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM