Betel Leaves : మన దేశంలో తమలపాకులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అన్ని వేడుకలలోనూ తమలపాకు కీలకమైన పాత్రను పోషిస్తుంది. తమలపాకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. తమలపాకులలో విటమిన్ సి, నియాసిన్, రిబోఫ్లావిన్, కెరోటిన్, విటమిన్స్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. నొప్పుల నుండి ఉపశమనం కలిగించడానికి తమలపాకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తమలపాకులను పేస్టుగా చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో రాస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే తమలపాకుల రసం తాగితే శరీరం లోపల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు నొప్పులు ఉన్న ప్రదేశంలో తమలపాకులు పెట్టి కట్టుకడితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. తమలపాకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను నాశనం చేస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ ఆకులను తింటే శరీరంలోని విషాలు బయటకు పోతాయి. అలాగే తమలపాకు ఆకలి హార్మోన్లను పునరుద్ధరిస్తుంది. ఆకలి లేని వారిలో ఆకలి పెరిగేలా చేస్తుంది. నోటికి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది.
తమలపాకులలో యాంటీ బయోటిక్ ప్రభావాలు ఉండడం వల్ల దగ్గు, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి చాలా బాగా సహాయ పడుతుంది. తమలపాకు రసంలో తేనె కలిపి తీసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇప్పుడు దాదాపుగా ప్రతి ఇంటిలోనూ తమలపాకు తీగ ఉంటుంది కాబట్టి ప్రతి రోజు మీకు కుదిరిన సమయంలో లేత తమలపాకు ఒకటి తింటే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…