Chanti Movie : చంటి లాంటి హిట్ మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవ‌రో తెలుసా..?

Chanti Movie : సినిమా రంగంలోకి న‌టుల వార‌సులు ఎంతో మంది వ‌చ్చారు. కానీ వారిలో కేవ‌లం కొంద‌రు మాత్రం త‌మ టాలెంట్‌తో నిల‌దొక్కుకున్నారు. చాలా కాలం నుంచి అలా వారు ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్నారు. అలాంటి వారిలో న‌టుడు వెంక‌టేష్ ఒక‌రు. విక్ట‌రీని ఆయ‌న ఇంటి పేరుగా మార్చుకున్నారు. చేసిన తొలి సినిమాతోనే ఘ‌న విజ‌యం సాధించారు. ఇక వెంక‌టేష్ త‌న కెరీర్‌లో ఎన్నో వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల్లో న‌టించారు. వాటిల్లో చంటి ఒక‌టి. ఈ మూవీలో వెంకీ అమాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించి ఆక‌ట్టుకున్నారు.

వెంకటేష్, మీనా కాంబినేషన్ లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన చంటి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలై దాదాపుగా 30 సంవత్సరాలు అయింది. ఈ సినిమాలో వెంకటేష్, మీనా అద్భుతంగా నటించారు. ఈ సినిమా తమిళంలో హిట్టయిన చిన్న తంబీ సినిమాకు రీమేక్. చంటి సినిమాలో వెంకటేష్ అమాయకమైన పల్లెటూరి యువకుని పాత్రలో నటించారు. ఈ సినిమాలో మొదటగా హీరోగా రాజేంద్ర ప్రసాద్ ని అనుకున్నారట. ఆ సమయంలోనే చిన్న తంబి సినిమాను రామానాయుడు చూశారట.

Chanti Movie

ఈ సినిమా రీమేక్ రైట్స్ ను కేఎస్ రామారావు కొనుగోలు చేశారు. ఈ సినిమాలో హీరోగా చేయటానికి రాజేంద్ర ప్రసాద్ ని ఒప్పించారట. ఈ సినిమా వెంకటేష్, సురేష్ బాబు కూడా బాగా నచ్చడంతో కె.ఎస్.రామారావు.. రవిరాజా పినిశెట్టిని వెంకటేష్ హీరోగా పెట్టి చేయమని చెప్పారట. అయితే రవిరాజా పినిశెట్టి రాజేంద్ర ప్రసాద్ కి మాట ఇచ్చాను చేస్తే ఆ హీరో తోనే చేస్తాను అని పట్టుబట్టారు అట. అప్పుడు చిరంజీవి రవిరాజా పినిశెట్టిని ఒప్పించటంతో వెంకీ మీనాలతో ఈ సినిమా తెరకెక్కింది. అలా రాజేంద్ర ప్ర‌సాద్ ఈ మూవీలో న‌టించ‌లేదు. కానీ ఆయన చేసి ఉంటే కెరీర్ మ‌రోలా ఉండేది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM