Kamareddy : వారిద్దరూ ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి బంధం ద్వారా ఒక్కటయ్యారు. ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన ఆ వధువుకు భర్త నుంచి చేదు అనుభవం ఎదురయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సైకోగా మారి చివరికి తన భార్య గొంతు కోసి ప్రాణాలు తీసిన ఘటన కామారెడ్డి బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్ మండలానికి చెందిన సుధారాణి అనే యువతి శివయ్య పల్లి గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తిని గత ఎనిమిది నెలలుగా ప్రేమిస్తోంది. ఈ క్రమంలోనే వీరి పెళ్లి విషయం ఇంట్లో పెద్దవారికి చెప్పడంతో పెద్దవాళ్ళు వీరి పెళ్లికి అంగీకరించి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఇలా వివాహం అనంతరం కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన సుధారాణికి అత్తారింట్లో చేదు అనుభవం ఎదురయింది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనని అవమానిస్తూ వేధింపులకు గురి చేయడంతో ఈ విషయాన్ని సుధారాణి తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో పెద్ద వారు ఈ విషయంపై కలగజేసుకొని వారికి సర్ది చెప్పారు. అయితే కిరణ్ కుమార్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కావడంతో పెళ్లి తర్వాత వీరిద్దరూ ప్రగతినగర్‌లోని శ్రీసాయిద్వారకా అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం సుధారాణి తల్లిదండ్రులను హైదరాబాద్ రావాల్సిందిగా కిరణ్ కుటుంబ సభ్యులు కోరారు.
సుధారాణి తల్లిదండ్రులు వచ్చి తలుపు తట్టగా ఎంతసేపటికీ డోర్ తీయకపోవడంతో సుధారాణి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా తీవ్రమైన రక్తస్రావంలో సుధారాణి విగతజీవిగా పడి ఉండగా.. వారి అల్లుడు కిరణ్ కుమార్ కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇలా ప్రాణాలతో ఉన్న అతనిని సరైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సుధారాణిని తన భర్త కూరగాయలు కోసే కత్తితో మెడ, కాళ్లు, చేతులు కోయడంతో తీవ్ర రక్తస్రావమై మరణించింది. తన కూతురిని అత్తింటి వారే చంపారంటూ సుధారాణి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…