దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రోజూ దేశంలో 3.50 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌లను విధించి అమలు చేస్తున్నారు. అయితే తెలంగాణలో లాక్‌డౌన్ విధించే అంశంపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.
కరోనా నుంచి కోలుకున్న తరువాత సీఎం కేసీఆర్ అనేక రోజులకు ప్రగతి భవన్ చేరుకుని చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్‌తోపాటు ఇతర వైద్య శాఖ అధికారులతో కలిసి రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదన్నారు.
లాక్‌డౌన్ విధించినప్పటికీ పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉందని, అందువల్ల తెలంగాణలో లాక్‌డౌన్ విధించబోమని అన్నారు. లాక్‌డౌన్ వల్ల ప్రజల జీవితాలు నాశనమవుతాయని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు. అయితే రాష్ట్రంలో వీకెండ్ లాక్‌డౌన్‌ను విధించాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో దానిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. హైకోర్టు సూచించినందువల్లే రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను విధించారు కనుక కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో వీకెండ్ లాక్‌డౌన్‌ను విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…