బ్రేకింగ్ : తెలంగాణ‌లో లాక్ డౌన్‌పై సీఎం కేసీఆర్ నిర్ణ‌యం ఇదే..!

May 6, 2021 10:28 PM

దేశ‌వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రోజూ దేశంలో 3.50 ల‌క్ష‌ల‌కు పైగా కోవిడ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. బుధ‌వారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో అనేక రాష్ట్రాల్లో ఇప్ప‌టికే లాక్‌డౌన్‌ల‌ను విధించి అమ‌లు చేస్తున్నారు. అయితే తెలంగాణ‌లో లాక్‌డౌన్ విధించే అంశంపై సీఎం కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

cm kcr decision on lock down

క‌రోనా నుంచి కోలుకున్న త‌రువాత సీఎం కేసీఆర్ అనేక రోజుల‌కు ప్ర‌గతి భ‌వ‌న్ చేరుకుని చీఫ్ సెక్రెట‌రీ సోమేష్ కుమార్‌తోపాటు ఇత‌ర వైద్య శాఖ అధికారుల‌తో క‌లిసి రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే ప్ర‌స‌క్తే లేద‌న్నారు.

లాక్‌డౌన్ విధించిన‌ప్ప‌టికీ ప‌లు రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతూనే ఉంద‌ని, అందువ‌ల్ల తెలంగాణ‌లో లాక్‌డౌన్ విధించ‌బోమ‌ని అన్నారు. లాక్‌డౌన్ వల్ల ప్ర‌జ‌ల జీవితాలు నాశ‌న‌మ‌వుతాయ‌ని, ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలుతుంద‌న్నారు. అయితే రాష్ట్రంలో వీకెండ్ లాక్‌డౌన్‌ను విధించాల‌ని హైకోర్టు సూచించిన నేప‌థ్యంలో దానిపై సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకోనున్నారు. హైకోర్టు సూచించినందువ‌ల్లే రాష్ట్రంలో రాత్రి క‌ర్ఫ్యూను విధించారు క‌నుక కోర్టు ఆదేశాల మేర‌కు తెలంగాణ‌లో వీకెండ్ లాక్‌డౌన్‌ను విధించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment